SBS ఆస్ట్రేలియా దక్షిణాసియా కమ్యూనిటీ కోసం కొత్త ఛానెల్‌ ప్రకటన

SBS వారు దక్షిణాసియా శ్రోతలకు పనివేళల మధ్య ఇంట్లో నుండి లేదా మొబైల్ ‌ లో ప్రసారాలను అందుబాటులో ఉండేలా షెడ్యూల్ లను అప్ డేట్ చేస్తున్నారు.

sbs broadcast languages.jpg

SBS offers more ways to listen and connect with content that you love; Hindi, Bangla, Malayalam, Urdu, Tamil, Punjabi, Nepali, Sinhala and Gujarati programs now available on SBS PopDesi. Credit: SBS

SBS దక్షిణాసియా ప్రసారాల కోసం మరొక ఆడియో ఛానల్ ను ప్రకటించినందున గతంలో కంటే ఇప్పుడు వినడం చాలా సులభం.

గురువారం 5 అక్టోబర్ 2023 నుండి, బంగ్లా, గుజరాతీ, హిందీ, నేపాలీ, మలయాళం, పంజాబీ, సింహళ, తమిళ మరియు ఉర్దూ కార్యక్రమాలు SBS పాప్ ‌దేశీలో ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల మధ్య ప్రత్యక్ష ప్రసారం చేయబడతాయి.

ఈ ఛానెల్ ద్వారా, ఇంట్లో దక్షిణాసియా భాష మాట్లాడే 1.5 మిలియన్లకు పైగా ఆస్ట్రేలియన్లను చేరుకోవాలని SBS వారి లక్ష్యం.

కొత్తగా అప్ డేట్ చేసిన మరియు రిఫ్రెష్ చేసిన షెడ్యూల్ ‌ తో, SBS PopDesi శ్రోతలు వారు ఇష్టపడే ప్లాట్ ‌ ఫారమ్ లో మరియు వారికీ నచ్చిన సమయంలో కథలు, పాటలు మరియు పోడ్కాస్ట్ లను వినవచ్చు.

SBS రేడియో2 ద్వారా అవే ప్రసారాలను మీరు వినవచ్చు.

SBS50 ఆడియో స్ట్రాటజీలో భాగం ద్వారా ప్రేక్షకుల ప్రాధాన్యతలను అర్ధం చేసుకొని ప్రసార రేడియో, లైవ్ స్ట్రీమింగ్, డిజిటల్ పబ్లిషింగ్ మరియు పోడ్ ‌ కాస్టింగ్ ‌ లలో డిజిటల్-ఫస్ట్ ఉత్పత్తిని వేగవంతం చేయడంపై ద్రుష్టి సారిస్తున్నారు.

"దక్షిణాసియా వారికి కొత్త ఛానెల్ ‌రావడం చాలా ఆనందంగా ఉందని " SBS ఆడియో అండ్ లాంగ్వేజ్ కంటెంట్ డైరెక్టర్ డేవిడ్ హువా అన్నారు.
ఒకే చోట మీరు SBS భాషా ప్రోగ్రామ్ వార్తలు, ప్రస్తుత వ్యవహారాలు మరియు మా వినోదం మరియు సంగీత సమర్పణలను వింటారు. ఈ కొత్త మార్పులను ప్రేక్షకులు ఆదరిస్తారని కోరుకుంటున్నాము.
David Hua, SBS Director of Audio and Language Content
సాంస్కృతికంగా మరియు భాషాపరంగా విభిన్న నేపథ్యాలతో కమ్యూనిటీలకు మెరుగైన సేవలను అందించడానికి SBS భాషలను క్రమం తప్పకుండా అప్ ‌ డేట్ చేస్తూ వస్తుంది.

గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో దక్షిణ ఆసియన్లు వేగంగా పెరుగుతున్నారని తెలుస్తోంది.

ఆస్ట్రేలియన్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ 2021 జనాభా లెక్కల ప్రకారం పంజాబీ మాట్లాడే జనాభా 239,033, మొదట ఉన్నట్లు తరువాత హిందీ మాట్లాడేవారు 197,132, నేపాలీ మాట్లాడేవారు 133,068 మరియు ఉర్దూ మాట్లాడేవారు 111, 873.1 పెరుగుతూ వస్తున్నారు.

జనాభా లెక్కల ప్రకారం, తమిళం మాట్లాడే వారు 95,404 ఉన్నారు.

సింహళ వారు 85,869 ఉండగా , గుజరాతీ వారు 81,334, మలయాళం మాట్లాడేవారు 78,738, బంగ్లా 70,116 మరియు తెలుగు వారు 59,406 ఉన్నారు.

SBS PopDesi ని దక్షిణాసియా కమ్యూనిటీలకు ఛానెల్ గా మార్చడం మరియు కొన్ని భాషా ప్రోగ్రామ్ ‌లను కొత్త టైమ్ స్లాట్ ‌లకు మార్చటం ద్వారా అందరికి అందుబాటులో ఉంటుందని గమనించాలి.
SBS PopDesi destination_.png
Source: SBS
ప్రతిపాదిత మార్పుపై ప్రేక్షకులు సానుకూలంగా స్పందిస్తున్నారు. ఈ మార్పు వినగానే SBS పంజాబీ వినేవారు స్పందిస్తూ :ప్రోగ్రామ్ ను రాత్రి నుండి సాయంత్రం వరకు మార్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేసారు.మరియు కమ్యూనిటీ అభిప్రాయాలను అమలు పరిచినందుకు మేము అభినందిస్తున్నాము" అని తెలిపారు.

SBS సమర్పణలను డిజిటల్ ‌ గా కూడా ప్రసారం చేయాలనీ నిర్ణయించింది , భవిష్యత్తులో ఆడియో వినియోగానికి ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.

SBS వారు విలక్షణమైన కంటెంట్ ‌ ప్రదర్శించడం కొనసాగిస్తూనే ఉంటారు.

అక్టోబర్ 5 నుండి రాబోతున్న మార్పులు:
SBS Pop Desi new schedule.png
Source: SBS Credit: SBS Nepali
SBS PopDesi సోమవారం నుండి శుక్రవారం వరకు ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల మధ్య మరియు వారాంతాల్లో సాయంత్రం 5 నుండి సాయంత్రం 6 గంటల వరకు భాషా కార్యక్రమాలను ప్రసారం చేస్తుంది.

ఈ గంటల వెలుపల సమయంలో ఉదయం, సాయంత్రం మరియు వారాంతాల్లో పాప్ ‌ దేశీ మ్యూజిక్ మిక్స్ ప్రసారం చేయబడుతుంది.

ఇప్పుడు శ్రోతలు వెబ్ ‌సైట లో AM/FM రేడియో, DAB+ రేడియో, డిజిటల్ టీవీ మరియు స్ట్రీమింగ్ ద్వారా SBS ఆడియో లాంగ్వేజ్ ప్రోగ్రామ్ ‌ లను వినడానికి అవకాశం ఉంటుంది.

పైన పేర్కొన్న అన్ని భాషా ప్రోగ్రామ్ లు SBS రేడియో 2లో మీకు అంతకముందు వింటున్న సమయాల్లోనే పునరావృతం చేయబడతాయి.

SBS రేడియో 2 ద్వారా మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా మరియు న్యూకాసిల్ లో AM మరియు FM ఫ్రీక్వెన్సీలలో ప్రసారం చేయబడుతుంది. ఆస్ట్రేలియాలోని ఇతర ప్రధాన కేంద్రాలలో AM లేదా FM ఫ్రీక్వెన్సీలలో కూడా SBS రేడియో జాతీయంగా ప్రసారం చేయబడుతుంది .మీరు తెలుసుకోవాల్సిన రేడియో ఫ్రీక్వెన్సీల

ఇవి షెడ్యూల్ ‌ లు మరియు ప్లాట్ ‌ ఫారమ్ ‌ లలో మార్పులే కాని , కమ్యూనిటీలు చాలా ఇష్టపడే SBS కంటెంట్ లో మార్పు ఉండదు.

With image inputs from Deeju Sivadas and Abhas Parajuli and Vrishali Jain.

Share
Published 12 October 2023 12:09pm
By Preeti Jabbal
Presented by Sandya Veduri
Source: SBS


Share this with family and friends