పునరుత్పత్తి వ్యవసాయంలో విశేష నైపుణ్యం కలిగి ఎంతో గుర్తింపు పొందిన సెకెమ్ మరియు డాక్టర్ రట్టం లాల్ వంటి నిపుణులతో ఈ బహుమతి పంచుకోవడం గౌరవంగా ఉంది. ప్రకృతి వ్యవసాయాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకు వెళుతున్న లక్షలాది చిన్నకారు రైతులు మరియు మహిళా సంఘాల ప్రేరణా శక్తి కి నిదర్శనంగా పేర్కొనవచ్చు. వ్యవసాయ సంక్షోభ సమయంలో రైతులు ప్రకృతి వ్యవసాయం ద్వారా తమ జీవనోపాదులను మెరుగుపర్చుకోవడమే గాకుండా ఆహారం, పోషక విలువల భద్రతకు భరోసా కల్పిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయ కార్యక్రమం భూమి మరియు ప్రజల అవసరాలకు ఏపీసీఎన్ఎఫ్ చూపుతున్న పరిష్కార మార్గం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.