ఈ నేపథ్యంలో అమెరికా వలసదారులలో మెక్సికన్ల తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారతీయ అమెరికన్లకు ప్రాధాన్యం పెరుగుతోంది. 2022 లెక్కల ప్రకారం అమెరికాలో భారతీయ సంతతికి చెందిన వారు దాదాపు 52 లక్షలమంది నివసిస్తున్నారని అంచనా. వీరు అత్యధికంగా కాలిఫోర్నియా, న్యూయార్క్, టెక్సస్, న్యూజెర్సీ, నార్త్ కరోలినా, ఆరిజోనా రాష్ట్రాలలో నివసిస్తున్నారు. వీరిలో దాదాపు 39లక్షల మంది నేడు ఓటు హక్కు కలిగి ఉన్నారు. తాజాగా జరుగనున్న ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్, కమలా హారిస్ భవిత్యాన్ని నిర్ధేశించ గల సామర్థ్యం వీరి చేతుల్లో ఉంది. వీరు ఎవరికి ఓటు వేస్తే, వారి అవకాశాలు మెరుగవుతాయంటే ఆశ్చర్యపోనక్కర్లేదు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.