ఆస్ట్రేలియాలో ఇల్లు అద్దెకు సులభంగా పొందడం ఎలా?

wan man mo woman eii stanap long foret blong wan haos

Wetem low vekensi rate naoia, blong faenem wan rent haos hemi no isi. Credit: xavierarnau/Getty Images

ప్రస్తుతం ఆస్ట్రేలియా రెంటల్ మార్కెట్‌లో 50,000 కంటే తక్కువ అద్దె ప్రాపర్టీలు ఉన్నాయి. రెండేళ్ల క్రితం ఈ సంఖ్య దాదాపు రెట్టింపు ఉండేది . మార్కెట్‌లో ఉన్న ఇల్లు చాలా తక్కువగా ఉండటంతో, అద్దె ఇల్లు దొరకడం గతంలో కంటే చాల కష్టం అవుతోంది . ఈ ఆర్టికల్ ద్వారా అద్దె ఇంటిని సులభంగా పొందటం ఎలాగో చూద్దాం.


Key Points
  • చాలా అద్దె ఇల్లు ప్రధాన వెబ్సైట్ల లో ప్రచురిస్తారు.
  • ఏజెంట్లు మరియు ఇంటి యజమానులకు మీ వ్యక్తిగత సమాచారం అవసరం. కాబట్టి దరఖాస్తు చేయడానికి ముందు మీ డాక్యుమెంటేషన్‌ను సిద్ధంగా ఉంచుకోండి.
  • మీరు ఎలాంటి ఇల్లు కావాలనుకుంటున్నారో దాని గురించి ఏజెంట్‌లను కలిసి మాట్లాడండి మరియు వారి ప్రాధాన్య అప్లికేషన్ పద్ధతిని కూడా అడిగి తెలుసుకోండి.
  • మీ కమ్యూనిటీ సోషల్ మీడియా నెట్‌వర్క్‌లను నుంచి ఇళ్లను గురించి వివరాలు తెలుసుకోండి.
ప్రస్తుత టైట్ రెంటల్ మార్కెట్‌లో ఇంటి కోసం వెతకడం ఉద్యోగ ఇంటర్వ్యూ కంటే కష్టంగా ఉందని, ఆస్ట్రేలియా లో అతిపెద్ద రెంటల్ పోర్టల్ rent.com CEO గ్రెగ్ బాడర్ అంటున్నారు.

అతను ఇంటిని వెతకడం లో ఉన్న ఇబ్బందులను చెప్పుకొచ్చారు.కొంతమంది అద్దె ఏజెంట్లు మరియు ఇంటి యజమానులు , యువకులకు అద్దెకు ఇవ్వడానికి ఇష్టపడరు అని అన్నారు. ఇంకా వారు "Former Rental History" కూడా చూడాలనుకుంటున్నారని, కొత్తవారికి ఇల్లు దొరకడం కష్టమని గ్రెగ్ బాడర్ అంటున్నారు.

Sydney Suburb overhead perspective roof tops
The number of available rental properties has almost halved compared to two years ago. Source: iStockphoto / mikulas1/Getty Images/iStockphoto
చాలా ఇళ్ళు rent.com.au, realestate.com.au మరియు domain.com.au వంటి సైట్‌లలో ప్రకటించబడతాయి . ఇంటి వీక్షణ సమయాలు మరియు వారపు అద్దె రేట్లు ఈ సైట్‌లలో అందుబాటులో ఉంటాయి. ఇంటి వీక్షణ సమయం సాధారణంగా 10 నుండి 15 నిమిషాలు ఉంటుందని గుర్తుంచుకోవడం ముఖ్యం. వారాంతాల్లో వారాంతపు రోజుల కంటే ఎక్కువ రద్దీ ఉంటుంది.

అద్దె కోసం దరఖాస్తు చేయడం ఎలా?

ఆస్ట్రేలియా అంతటా 800,000 మంది రియల్ ఎస్టేట్ ఏజెంట్లు ఉన్నారు. అయితే, దరఖాస్తు ప్రక్రియ భిన్నంగా ఉంటుంది.

దేశవ్యాప్తంగా ఒకే రీతిలో నియమాలు లేదా చట్టాలు లేనప్పటికీ, దరఖాస్తుదారులు ఈ కింది గుర్తింపులను సమర్పించాల్సి ఉంటుందని గ్రెగ్ బాడర్ వివరించారు.

1. ఉపాధి మరియు ఆదాయ రుజువు

2. మునుపటి ఇంటి యజమానులు నుండి లేఖలు

3. అద్దె చరిత్రను నిరూపించడానికి పత్రాలు

మీరు మొదటిసారి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసినప్పుడు, మీ సమాచారాన్ని నిల్వ చేయడానికి ఆన్‌లైన్‌లో సౌకర్యాలు ఉన్నాయి, తద్వారా భవిష్యత్తులో అద్దె వెబ్‌సైట్‌లు మరియు ఏజెంట్లకు దీనిని ఉపయోగించవచ్చు.

చాలా యాప్‌లు మరియు వెబ్‌సైట్‌లు ఉపయోగంలో ఉన్నందున, మీరు మీ వివరాలను బహుళ వెబ్‌సైట్‌లకు అప్‌లోడ్ చేయడానికి కొంత సమయం వెచ్చించాల్సి ఉంటుంది.

గ్రెగ్ బాడర్ మాట్లాడుతూ "ఒక విజయవంతమైన దరఖాస్తుదారుగా మీ అవకాశాలను పెంచే రహస్యం, దరఖాస్తు చేయడానికి ముందు ఏజెంట్‌తో మాట్లాడాలని" చెపుతున్నారు.

Real estate agent showing a property to a couple
It is important to speak to the realestate agent directly before applying for a rental property. Credit: andresr/Getty Images
మీ వద్ద మునుపటి అద్దె చరిత్రకు సంబంధించిన రుజువు లేకుంటే, ఏజెంట్ పరిగణించే ఇతర అంశాలు కూడా ఉన్నాయి.

ఉదాహరణకు మెల్‌బోర్న్‌కు చెందిన వ్యాపారవేత్త మరియు చిన్న వ్యాపార యజమాని అయిన నిక్, చాలా కాలం తర్వాత అద్దె మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నందున తన పరిస్థితిని వివరిస్తూ పరిచయ లేఖతో తన స్థానిక ఏజెంట్‌కి ఇమెయిల్ పంపినట్లు చెప్పారు.

నిక్ తన స్వంత వ్యాపారాన్ని నడుపుతున్నందున తన ఆదాయానికి రుజువుగా పన్ను రిటర్న్ సమాచారాన్ని అందించగలిగారు .ఈ విధంగా నేరుగా ఏజెంట్లను సంప్రదించడం వల్ల అద్దె ఇంటిని సులభంగా పొందే అవకాశం ఉంది. చిన్న వ్యాపార యజమాని నిక్ ఆన్‌లైన్‌లో కూడా దరఖాస్తు చేయకుండానే తన తదుపరి అద్దె ఇంటిని ఖరారు చేస్కుకోగలిగాడు.

నిక్ తన ఏజెంట్‌తో నేరుగా మాట్లాడాడని, అతను అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని దగ్గరే ఇంకొక ఇల్లు ఉన్నందున, వెంటనే ఆయనకు ఇల్లు దొరికిందని చెప్పారు

Rental సైట్‌లకు ప్రత్యామ్నాయాలు

సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లు అద్దె ఇళ్ల గురించి సమాచారాన్ని అందిస్తున్నప్పటికీ, వాటివల్ల మోసాలకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.గ్రెగ్ బాడర్ ఫోన్ ద్వారా దేనికీ అంగీకరించవద్దని లేదా ధృవీకరణ లేకుండా చెల్లించవద్దని కోరారు.

మీరు ఏ ప్రాంతంలో నివసించాలనుకుంటున్నారో నిర్ణయించుకున్న తర్వాత, మీ కమ్యూనిటీ తో కనెక్ట్ అవ్వడానికి ఇది సహాయకరంగా ఉంటుంది.

బైసన్ రహీమి మెల్‌బోర్న్ East లో లవ్ & కో రియల్ ఎస్టేట్‌లో రెంటల్స్ హెడ్.భాష మరియు సాంస్కృతిక అడ్డంకులను తొలగించి, ప్రజలు ఇల్లు వెతకడం లో సహాయపడటానికి తన స్థానిక ఫార్సీ మాట్లాడే సంఘంతో సన్నిహితంగా పనిచేస్తున్నట్లు అతను చెప్పారు.

అడల్ట్ మల్టికల్చరల్ ఎడ్యుకేషన్ సర్వీసెస్ (లేదా AMES) వంటి కమ్యూనిటీ సేవలు అద్దె గృహాల కోసం వెతుకుతున్న కొత్త వ్యక్తులను మిస్టర్ రహీమిని కనెక్ట్ చేస్తారు. కొత్తవారి నుండి తనకు ప్రతి రెండు రోజులకు ఒక ఫోన్ కాల్ వస్తుందని మరియు వారి నేపథ్యాన్ని తెలుసుకోవడం మరియు వారి భాషలో మాట్లాడటం వాళ్లకు చాలా సహాయంగా ఉంటుందని వివరించారు. మొత్తం నియామక ప్రక్రియను చాలా సులభతరం చేస్తుందని రహీమీ చెప్పారు.

rent.com.au వంటి వెబ్‌సైట్‌లలో మీరు అద్దె ప్రాపర్టీలు మరియు విధానాల గురించి తెలుసుకోవలసిన మొత్తం సమాచారాన్ని అందిస్తాయి.

Share