Key Points
- గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులు మీకు కనిపిస్తే, మీ లోకల్ వైల్డ్ లైఫ్ రెస్క్యూ సర్వీస్‌ను కాంటాక్ట్ అవ్వడం ద్వారా ఎక్స్¬పర్ట్ సహాయం తీసుకోగలుగుతారు.
- జంతువులకు సహాయం చేసేటప్పుడు, మీరు జాగ్రత్తగా ఉంటూ జంతువు ని కూడా భద్రంగా ఉండేలా చూసుకోండి.
- వెటర్నరీ డాక్టర్లు గాయపడిన జంతువులను పరీక్షించి, చికిత్స చేస్తారు, మరియు వన్యప్రాణి సంరక్షకులు (వైల్డ్ లైఫ్ కేరర్స్) జరుగుతున్న చికిత్సకు మరియు పునరావాసానికి సహాయం చేస్తారు.
కంగారూలు, వాలబీలు, వాంబాట్స్, పోస్, కప్పలు, పక్షులు, పాములు మరియు సముద్రపు జంతువులతో సహా ప్రపంచంలోని అత్యంత వైవిధ్యమైన మరియు ఆకర్షణీయమైన వన్యప్రాణులకు ఆస్ట్రేలియా నిలయం.
మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడ నివసిస్తున్నారనే దాన్ని బట్టి, మీరు చూసే వన్యప్రాణుల జాతులు మారుతూ ఉంటాయి. దురదృష్టవశాత్తు, జంతువులు కొన్నిసార్లు వాహనాలు, మంటలు లేదా వరదల వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల అనారోగ్యానికి గురవుతాయి లేదా గాయపడతాయి.
గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న జంతువులు మీకు కనిపిస్తే, సహాయం ఎలా చేయాలో మరియు ఎక్స్¬పర్ట్ సహాయం ఎక్కడ పొందాలో తెలుసుకోవడం చాలా ముఖ్యం. జంతువులకు చికిత్స చేసి వాటిని రికవరీ చేయడం ద్వారా వాటిని తిరిగి అడవిలోకి తిరిగి పంపగలుగుతాం.

Wael laef veterinarian Dr Tania Bishop - WIRES.jpg
ఆస్ట్రేలియాలో డ్రైవింగ్ చేసేటప్పుడు, ముఖ్యంగా రీజినల్ ప్రాంతాలలో, ముఖ్యంగా ఉదయం మరియు సాయంత్రం సమయంలో జంతువులు ఎక్కువగా సంచరిస్తున్నప్పుడు కారు నుండి వన్యప్రాణులను చూడటం వింతేమీ కాదు.Tania Bishop
"మీరు క్యాంపింగ్ లో మరిన్ని జంతువులను చూడడానికి మంచి అవకాశం ఉంటుంది మరియు మీరు ఎంత నిశ్శబ్దంగా ఉంటే, అంత ఎక్కువగా వాటిని చూసే అవకాశం ఉంటుంది " అని డాక్టర్ బిషప్ చెపుతున్నారు.

Stradbroke Island in Queensland, Australia Source: iStockphoto / Kevin LEBRE/Getty Images/iStockphoto
గాయపడిన జంతువులను మీరు గమనించినట్లయితే, నిపుణుల సహాయం తీసుకోండి
గాయపడిన లేదా అనారోగ్యంతో ఉన్న వన్యప్రాణులు ముఖ్యంగా కంగారూలు, వాంబాట్స్ లేదా కోలాస్ వంటి పెద్ద జాతులు మీకు ఎదురుపడినపుడు, వీలైనంత త్వరగా నిపుణుల సహాయం తీసుకోవాలని డాక్టర్ బిషప్ రికమెండ్ చేస్తున్నారు.
లోకల్ వెటర్నేరియన్ లేదా స్థానిక కౌన్సిల్ రేంజర్, టెలిఫోన్ వైల్డ్ లైఫ్ హెల్ప్¬లైన్ లేదా వన్యప్రాణుల రెస్క్యూ ఆర్గనైజేషన్¬తో కాంటాక్ట్ అయ్యే మొబైల్ ఫోన్ యాప్స్ వంటివి ఉన్నాయి . ఇవి జంతువులను కాపాడడానికి మరియు ఇంకా వాటికి అవసరమయ్యే జాగ్రత్తలను పొందేలా చేస్తాయి. ఆస్ట్రేలియాలోని ప్రతి రాష్ట్రంలో మరియు ప్రతి ప్రాంతంలో వైల్డ్¬లైఫ్ రెస్క్యూ మరియు కేర్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, కాబట్టి మీరు ఎక్కడ ఉన్నారో దానికి సరైన వైల్డ్¬లైఫ్ కేర్ హెల్ప్¬లైన్ కోసం ఆన్¬లైన్¬లో వెదకవచ్చు.
మీరు మొదట జాగ్రత్తగా ఉంటూ మరియు ఇతరుల భద్రతను పరిగణనలోకి తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.
ముఖ్యంగా రోడ్డు పక్కన వన్యప్రాణులు కనిపిస్తే, మీ కారును సులభంగా కనిపించే చోట ఎక్కడైనా పార్క్ చేసి, సురక్షితమైన స్థితిలో ఉండేలా చూసుకోవడం ఎల్లప్పుడూ ముఖ్యం. గాయపడిన వన్యప్రాణులు భయపడతాయని గుర్తు పెట్టుకోండి మరియు అవి గాయపడినప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ప్రయత్నిస్తాయి" అని డాక్టర్ బిషప్ చెప్పారు.

A bettong with a cast and bandage on its fractured leg - WIRES.jpg
మీరు మొదట జంతువులను దగ్గరకు తీస్కుంటున్నపుడు వీలైనంత నిశ్శబ్దంగా మరియు ప్రశాంతంగా దగ్గరికి వెళ్ళడం చాలా ముఖ్యం. మీరు మొదట సేఫ్¬గా , వీలైతే జంతువును టవల్ కప్పండి లేదా క్లాత్ బాస్కెట్తో పెట్టండి , ఇది వేడి నుండి మరియు స్ట్రెస్ నుండి కొంత రిలీఫ్¬ను ఇస్తుంది. వీలైనంత త్వరగా సహాయం కోసం కాల్ చేయండి.Tania Bishop
కంగారూలు, వాలబీలు, వాంబాట్స్ మరియు పోసమ్స్ వంటి జంతువులు వాటి పిల్లలను సంచిలో మోసే క్షీరదా జాతుల (మ్యామెల్స్). అవి చనిపోయిన తరువాత మీకు కనిపిస్తే, జంతువు యొక్క పౌచ్¬ను చెక్ చేయడం చాలా ముఖ్యం అని Dr Bishop చెపుతున్నారు .
"జుట్టు ఉంటేనే సంచిలోంచి కంగారూ పిల్లను బయటకు తీయండి. దీనికి ఒకవేళ జుట్టు లేకపోతే స్పెషల్ కేరర్ ఆ కంగారూ పిల్లను సంచి నుండి తీయవలసి ఉంటుంది, ఎందుకంటే వాటి నోరు సాధారణంగా ఆ సమయంలో పొదుగును పట్టుకుని ఉంటుంది ఇంకా వాటిని అలా తీయడం వల్ల తీవ్రమైన హానిని కలిగిస్తుంది. ఆ కంగారూ పిల్లను వెచ్చని చీకటి వాతావరణంలో ఉంచడం చాలా ముఖ్యం మరియు వీలైనంత త్వరగా కేరర్ వద్దకు తీసుకుని వెళ్ళడం చాలా ముఖ్యం, ఎందుకంటే అవి వాటి తల్లులకు దూరం అయినప్పుడు చాలా బాధను అనుభవిస్తాయి ఇంకా అవి మరింత ఒత్తిడికి గురైతే చాలా సులభంగా చనిపోతాయి.
మీ వాహనంలో ప్రాథమిక వన్యప్రాణుల ప్రథమ చికిత్స కిట్ ఉండేలా చూసుకోండి
వన్యప్రాణులకు బేసిక్ ఫస్ట్ ఎయిడ్ కిట్¬లో భాగంగా సాధారణంగా లభించే కొన్ని ఇంట్లో ఉండే సామాన్లు సరిపోతాయని డాక్టర్ బిషప్ చెప్పారు.
"ఒక వైల్డ్ లైఫ్ ఫస్ట్ ఎయిడ్ కిట్¬లో పాత మందమైన టవల్, అది గోర్లు చిక్కుకోవడానికి ఎటువంటి వదులుగా ఉండే దారాలు లేనిది , కార్డ్ బోర్డ్ బాక్స్ లేదా పెట్-క్యారియర్ మరియు మందమైన గార్డెనింగ్ గ్లౌజులు మరియు వీలైతే, ఎప్పుడైనా పిల్ల కంగారూ కోసం పిల్లో స్లిప్ ఉపయోగపడుతుంది .”
గాయపడిన వన్యప్రాణులను వీలైనంత త్వరగా వెటర్నేరియన్ చూడాలి. చట్టం ప్రకారం లైసెన్స్ పొందిన మరియు ట్రైనింగ్ పొందిన వన్యప్రాణుల సంరక్షకులు మరియు పశువైద్యులు మాత్రమే ఆస్ట్రేలియన్ వన్యప్రాణులను జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే వీటి సంరక్షణ జంతువు బట్టి మారుతూ ఉంటుంది.

A young wallaby under general anaesthetic in a wildlife hospital receiving treatment for a fractured leg - WIRES.jpg
Morgan Philpott వైల్డ్¬లైఫ్ కేరర్, గాయపడిన మరియు అనారోగ్యంతో ఉన్న వన్యప్రాణుల సంరక్షణకు దశాబ్దానికి పైగా పనిచేస్తున్నారు.
"కేరర్స్¬గా ఉన్న మాకు మా ఫోన్లలో రెస్క్యూ గురించి తెలియజేసే మెసేజ్ వస్తుంది. ఆపై సాధారణంగా వారిని సంప్రదించి మరిన్ని వివరాలు తెలుసుకుని, అక్కడి నుంచి తీసుకెళ్తాం. ఈ జంతువులను త్వరగా చికిత్స చేయడం చాలా అవసరం " అని డాక్టర్ Philpott చెప్పారు.