Key Points
- ఉచిత యాప్‌లు, ఆన్‌లైన్ లెర్నింగ్ టూల్స్ ద్వారా నిదానంగా ఇంగ్లీష్ ను సాధన చేసుకోవచ్చు.
- ప్రభుత్వం నడుపుతున్న Adult Migrant English Program ద్వారా ఇంగ్లీష్ భాషా నైపుణ్యాన్ని మెరుగుపరచటానికి ఉపయోగపడుతుంది.
- ఇంగ్లీష్ ప్రసారాలను ఉప శీర్షికలను పెట్టి చూడటం మరియు ఆడియో పుస్తకాలను వినడం వంటి వాటి ద్వారా తెలియకుండానే మీ వ్యాకరణాన్ని మెరుగుపరిస్తుంది.
"మార్సెల్లా అగిలార్ 'Adult Migrant English Program' (AMEP) తో వాలంటీర్ కోఆర్డినేటర్."
"ఇంగ్లీషు భాషా అభ్యాసకులు అనేక అడ్డంకులను ఎదురుకొంటున్నారు, అందులోను భయం వాళ్ళకు అతిపెద్ద అడ్డంకి. అని ఆమె అంటున్నారు.
వారికి చదువు అయిపోయాక చాలా గ్యాప్ ఉండి ఉండవచ్చు లేదా కాంఫిడెన్స్ లేక ఇంగ్లీష్ లో మాట్లాడలేక పోవచ్చు, కారణం ఏదైనా కాని, మీ వ్యక్తిగత పరిస్థితుల బట్టి మీకు మద్దతు లభిస్తుంది.".
మీరు ఇంగ్లీష్ లో తప్పులు మాట్లాడిన ఫర్వాలేదు, ఎవరు పట్టించుకోరు. భాష మాట్లాడినపుడు మీరు చెప్పాలనేది వారికి అర్ధమవుతుందా లేదా అనేదే ముఖ్యం.Marcella Aguilar
అధికారిక ఆంగ్ల అధ్యయనాలు:
"ఇంగ్లీష్ లాంగ్పోర్ట్స్" ఇంగ్లీష్ లాంగ్వేజ్ కాలేజీ అధ్యయనాల డైరెక్టర్ అలిసన్ లెన్నాన్ వారి ప్రకారం ఆంగ్ల భాషపై బలమైన అవగాహన రావడం చాలా ఉపయోగపడుతుందని చెపుతున్నారు.
"మరింత క్రమబద్ధమైన ఆంగ్ల శిక్షణను పొందడం వారిని భవిష్యత్తులో ఉద్యోగాల కోసం, భవిష్యత్తు అధ్యయనాల కోసం ఎంతో మేలు చేస్తుంది” అని ఆమె అన్నారు.
"చాలా వీసాలకు ఇంగ్లీష్ లో ప్రావీణ్యతకు రుజువుగా చూపించవలసి రావచ్చు.
"వీసా దరఖాస్తులకు ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేక ఆంగ్ల భాషా పరీక్షలను ద్వారా గుర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలు, టాఫే, ప్రైవేట్ కళాశాలలు, భాషా కేంద్రాలు IELTS*, CAE*, టోఫెల్ * వంటి పరీక్షలు ద్వారా మీ ప్రావీణ్యతను గుర్తిస్తారు.
.

Credit: Westend61/Getty Images/Westend61
'ప్రయాణం మరియు వినోదం కోసం ఇక్కడకు వచ్చే విద్యార్థులు సాధారణ ఇంగ్లీష్ కోర్సులను మీద ధ్యాస పెడితే సరిపోతుదన్నారు.
'కొందరు విద్యార్థులు యూనివర్సిటీ లో గ్రాడ్యుయేట్ అవ్వాలనుకునే వారు, TOEFL మరియు IELTS వంటి ఆప్షన్స్ చూడవచ్చు. TAFE లేదా విశ్వ విద్యాలయాల కు రూట్ ప్రోగ్రామ్స్ అందించే పాఠశాలలు ఉన్నాయి' అని అయన వివరించారు.
'ఈ కోర్సులకు విద్యార్థులు కొన్ని ఆవశ్యకతలను పాటించాలి. ఉదాహరణకు, విద్యార్థులు వారానికి కనీసం 20 గంటల "Face to Face" తరగతులతో భాషా పాఠశాలలో నమోదు చేసుకోవాలి.'".
READ MORE

English for Work
కొన్ని భాషా పాఠశాలలు మీకు భాషా నైపుణ్య పరీక్షలకు సిద్ధం చేయవచ్చు.
ఉదాహరణకు, మీరు వీసాలను మార్చుకోవాలనుకుంటే లేదా విశ్వవిద్యాలయంలో ప్రవేశించాలనుకుంటే, మీకు IELTS సర్టిఫికేట్ మార్కులు చూపించాల్సి ఉంటుందని, అల్లిసన్ లాంగ్పోర్ట్స్ వివరిస్తున్నారు.
“IELTS పరీక్షకు సంబంధించి మీకు అన్ని టిప్స్ లభించేటట్లుగా భాషా పాఠశాలలు శిక్షణను ఇస్తాయని చెపుతున్నారు.
The Adult Migrant English Program
ఆస్ట్రేలియా ప్రభుత్వ శాఖ నిధులు సమకూర్చిన Adult Migrant English Program (AMEP) వలసదారులకు సహాయం చేస్తుంది.
AMEP వాలంటీర్ మార్సెల్లా అగిలార్ ట్యూటర్ పథకంలో భాగంగా, జాగ్రత్తగా ట్యూటర్స్ ని విద్యార్థుల యొక్క వ్యక్తిగత పరిస్థితిని బట్టి, ఒక ట్రైనర్ కి ఒక విద్యార్థిని నిర్ణయిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా గణనీయమైన ఆంగ్ల భాషా ప్రావీణ్యం సంపాదించే అవకాశం ఉంది.
వారు భాషా ను మాత్రమే కాకుండా, కొన్నిసార్లు ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఓదార్పు మరియు ప్రోత్సాహాన్ని కూడా అందిస్తున్నారు.Marcella Aguilar
"మీరు ఇంట్లో కానీ లైబ్రరీలో లేదా ఎక్కడైనా బయట కలుసుకోవచ్చు.
“ప్రతి ఒక్కరూ తమ స్థానిక ఫ్యూచర్ కళాశాలలోకి ప్రవేశించి, ద్విభాషా సంబంధితంగా మాట్లాడి, మీకు నచ్చితే, చెప్పడం ద్వారా ట్యూటర్ కేటాయించే క్రమంలో చాలా సులభంగా అవుతుందని అంటున్నారు.
“వారు మీకు ప్రోత్సహించి, మీకు అన్ని సమయాలు సహాయం చేసే వారుగా ఉన్నారు".

A Taiwanese woman is listening to music/a podcast/an audiobook through a pair of white headphones. Credit: Peter Berglund/Getty Images
ఇంగ్లీష్ మెరుగుపరుచుకోవడానికి చిట్కాలు
Marcella Aguilar’s top tips:
- Teletext టీవీ ని చూడండి. ఉపశీర్షికలను చదివినప్పుడు, మీరు ఆస్ట్రేలియా యాసాలకు అలవాటుపడి, సాధారణ ఆస్ట్రేలియా వ్యక్తీకరణలను గమనించి నేర్చుకోగలుగుతారు.
- Duolingo, Bitsboard, Oz Phonics మరియు Book Creator వంటి ఉచిత అభ్యాస యాప్ లను డౌన్ లోడ్ చేయండి.
- ఆడియో బుక్స్ ని వినండి. మీరు వింటున్నప్పుడు, భాష యొక్క ఉచ్చారణ, లయ మరియు సంగీతం మీకు బాగా అర్ధమవుతుంది.
Hester Mostert’s top tips:
- మీరు సూపర్ మార్కెట్ కు వెళ్లినప్పుడు self-checkout మానేసి క్యాషియర్ల తో మాట్లాడండి. మీరు ఒక చిన్న ప్రసంగాన్ని ప్రాక్టీస్ చేసే అవకాశం వస్తుంది.
- మీరు బయటకు టాక్సీ లో వెళుతున్నప్పుడు , టాక్సీ మరియు ఉబర్ డ్రైవర్లతో మాట్లాడండి.
- కమ్యూనిటీ, స్పోర్ట్స్ గ్రూప్స్ వంటి ప్రోగ్రామ్స్ లో జాయిన్ అవ్వండి. మీరు సామాజికంగా ఉండడమే కాకుండా మీ ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్కిల్స్ ను పెంచుకోగలుగుతారు.

Credit: Image Source/Getty Images
Online learning
ABC మరియు SBS వారు అందించే ఉచిత ఆన్ లైన్ అభ్యాస సాధనాలను ద్వారా మీరు ఇంగ్లీష్ సులభంగా నేర్చుకోవచ్చు.
SBS Learn English లో వీడియోలు, టెక్స్ట్, పోడ్ కాస్ట్ ల ద్వారా ఆస్ట్రేలియా సంస్కృతి గురించి నేర్చుకోవడానికి మీకు సహాయపడుతుంది.
Acronyms
* International English Language Testing System (IELTS)
* Cambridge English: Advanced (CAE)
* Test of English as a Foreign Language (TOEFL)