ఆస్ట్రేలియా రూల్స్ ప్రకారం మీరు వ్యాపారాన్ని ప్రారంభించడం ఎలా?

Pikja blong wan praod female bisnis ona we i salem flaoa

Australia Explained - Hao blong statem wan bisnis long Ostrelia Credit: MoMo Productions/Getty Images

ఆస్ట్రేలియాలో వ్యాపారాన్ని ప్రారంభించడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మీ చిన్న వ్యాపార వృద్ధికి సహాయం, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి, ప్రభుత్వ కార్యక్రమాలు, గ్రాంట్లు, నిధులు మరియు పన్ను ప్రోత్సాహకాలు ఉన్నాయి.


Key Points
  • వ్యాపారాన్ని మీరు ఒక్కరే యజమాని గా కానీ, లేదా భాగస్వామ్యంగా కూడా మొదలుపెట్టవచ్చు.
  • మీకు 75,000 ఆదాయం వచ్చే వరకు మీరు GST కోసం నమోదు చేయవలసిన అవసరం లేదు.
  • వ్యాపారం అంటే ఆసక్తి ఉన్నవారికి ప్రభుత్వం గ్రాంట్లు, రుణాలు మరియు ప్రైవేట్ పెట్టుబడిదారులతో సహా వివిధ ఫైనాన్సింగ్ విషయాలకు సహాయం అందిస్తుంది.
ఆస్ట్రేలియా ఆర్థిక వ్యవస్థ కొత్తగా వ్యాపారాలు మొదలు పెట్టేవారికి వెన్నుతట్టి నడిపిస్తాయి. మీరు వ్యాపారం మొదలుపెట్టడానికి మీ దగ్గర ఒక చిన్న ఆలోచన చాలు, మీకు అన్ని విధాలుగా సహాయపడుతుంది.

డైరెక్టర్ా నాడిన్ కన్నెల్, వ్యాపారం చేయడానికి అన్ని దేశాల కన్నా ఆస్ట్రేలియా లో బాగా మద్దతు ఇస్తుందని తెలిపారు . పన్ను 10% GST కాగ ను మీ అంతట మీరే సులభమైన పద్ధతిలో రిజిస్టర్ చేసుకోవచ్చు.
గ్రాంట్ల ద్వారా ప్రభుత్వ ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఆస్ట్రేలియా వ్యాప్తంగా 70 బిలియన్ల కంటే ఎక్కువ ఉన్నాయని మరియు మీరు వ్యాపారం కొత్తగా మొదలుపెట్టడానికి స్పష్టమైన నిబంధనలు మరియు కావలసిన ఆర్ధిక సహాయాన్ని అందిస్తున్నాయి.
Nadine Connell
సిడ్నీలో ఉన్న ఆర్థిక శాస్త్ర విశ్లేషకుడు అబ్దల్లా అబ్దల్లా మాట్లాడుతూ , ఆస్ట్రేలియా లో స్థిరమైన ఆర్థిక వ్యవస్థను ఉందని చెప్పారు. వాస్తవానికి COVID సమయంలో ఆర్థిక మాంద్యం వచ్చినా, గత మూడు దశాబ్దాలుగా, స్థిరంగా అభివృద్ధి చెందుతూ ఉండటం మన ఆర్థిక వ్యవస్థ స్థితర్త్వం చూపుతుందని " Mr. అబ్దుల్లా వివరించారు.

అబ్దల్లా ప్రకారం, ఆస్ట్రేలియాలో వ్యాపార యజమానుల ఆస్తి హక్కులు, మేధో సంపత్తి మరియు అన్నింటినీ నియంత్రించే చట్టపరమైన దృఢమైన పద్దతులు ఉన్నాయి అని చెప్పారు.

"చట్టాలు స్పష్టంగా ఉన్నాయని, మరి ముఖ్యంగా, ఆస్ట్రేలియాలో అవినీతి తక్కువగా ఉంటుందని ," Mr అబ్దల్లా చెప్పారు.
1632969295970.jfif
Economics Analyst Abdallah Abdallah

ఎన్ని రకాల వ్యాపారాలను మీరు చేయొచ్చంటే?

మీరు వ్యాపారం మొదలుపెట్టే ముందు , వ్యాపారాన్ని ఎలా నిర్వహించవచ్చో తెలుసుకోవడం ముఖ్యం. మీరు ఏకైక యజమానిగా , లేక కంపెనీగా కానీ లేదా భాగస్వామ్యంగా కూడా నిర్వహించవచ్చు.ప్రతి వ్యాపారము దాని లక్ష్యాలను బట్టి భిన్నమైన రీతిలో వుంటుంది అని మిస్టర్ అబ్దల్లా అన్నారు.

ఉదాహరణకు మీరు ఎటువంటి గ్రోత్ ప్లాన్స్ లేకుండా స్థానిక ప్రాంతం లేదా సబర్బ్ ప్రాంతాల్లో సేవలను అందించే చిన్న వ్యాపారాన్ని అమలు చేయాలనుకుంటే , మీరు ఏకైక వ్యాపారిగా లేదా భాగస్వామ్యంగా పనిచేయడాన్ని పరిగణించవచ్చు.

కానీ, మీరు కంపెనీని ఒక బ్రాండ్‌గా ఎదగాలి అంటే , లేదా దానిలో కొంత భాగాన్ని అమ్మాలని కోరుకుంటే వాటికీ కంపెనీ లా మొదలుపెట్టడం మంచిదని అబ్దల్లా సలహా ఇస్తున్నారు.

" చాలా చిన్నగా ప్రారంభించిన చాలా వ్యాపారాలు ఇప్పుడు వారి బ్రాండ్ ను పెంచుకొని మిలియన్-బిలియన్ డాలర్ల విలువైనవి ఉన్నాయని " మిస్టర్ అబ్దల్లా చెప్పారు.

మీరు మీ వ్యాపారాన్ని ఎలా మొదలుపెట్టాలో నిర్ణయించున్న తరువాత, రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. స్థానిక చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. మీకు సహాయం చేసేందుకు ఎన్నో వనరులు కూడా అందుబాటులో ఉంటాయి అని Ms కన్నెల్ చెప్పారు.

మీరొక్కరే సొంతగా వ్యాపారం నమోదు చేసుకోవడానికి మరియు ఆస్ట్రేలియన్ బిజినెస్ నంబర్ (ABN)ని పొందేందుకు అవసరమైన చాలా సమాచారం అయా రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్‌లోనే అందుబాటులో ఉంటుంది.

మీరు 75,000 సంపాదించే వరకు మీరు GST కోసం నమోదు చేయవలసిన అవసరం లేదు. కాబట్టి, మీరు GST గురించి ఆలోచించనవసరం లేదు.
Abdallah Abdallah
Counting the Tip Jar
If you need financial support to start your business, Australia offers many outlets that you can reach out to. Credit: SolStock/Getty Images
మరోవైపు, మీరు కంపెనీని ప్రారంభించాలని అనుకుంటే మాత్రం, ఏర్పాటుకు మీ అకౌంటెంట్‌ను సందర్శించమని మిస్టర్ అబ్దల్లా సలహా ఇస్తున్నారు.

"కంపెనీల కోసం, ప్రత్యేక టాక్స్ ఫైల్ నంబర్‌ను నమోదు చేసుకోవాలి. మీరు ఒక్కరే వ్యాపారాన్ని మొదలుపెడుతుంటే , మీ TFNకి లింక్ చేయబడతుంది. కానీ కంపెనీల మొదలుపెట్టాలంటే , దానికి ప్రత్యేకంగా TFN ను ఏర్పాటు చేసుకోవాలి," అని ఆయన చెప్పారు.

ఆపదలను నివారించడానికి వ్యవస్థాపకులు భీమా పాలసీలను ఏర్పాటు చేయడం వంటి చట్టపరమైన విధులను తెలుసుకోవాలని కన్నెల్ వివరించారు.

" మీరు చేసే వ్యాపారం లో ఏదైనా సర్వీస్ చేస్తుంటే , జనరల్ బిజినెస్స్ ఇన్సూరెన్స్ మరియు ప్రొఫెషనల్ ఇండేమినిటి ఇన్సూరెన్స్
వంటి భీమాలను తీసుకోవడం ముఖ్యం." ఇది మీరు నిర్వహిస్తున్న వ్యాపార రకాన్ని బట్టి ఉంటుందని ఆమె చెప్పారు. మీరు మీ కంపెనీ లో ఎవరినైనా పనికి చేర్చుకోవాలంటే , పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.

వ్యాపార ప్రణాళిక

మీరు గమనించాల్సిన మరో అంశం ఏమిటంటే, మిమల్ని విజయాపదం వైపు మార్గం చూపే వ్యాపార ప్రణాళిక. చాలామంది దీనిని విజయానికి రోడ్‌మ్యాప్‌గా చూస్తారు.

మీ మార్కెట్‌ను బట్టి , మీ కస్టమర్‌లు ఎవరో తెలుసుకోవడం మరియు మీ మార్కెట్ ఎంత పెద్దది అని తెలుసుకోవడం అనేవి మొదటి దశలు అని కన్నెల్ చెప్పారు.

"మీ వ్యాపారంలో పోటీదారులు ఎవరు? మీ ప్రొడక్ట్స్ ఏవి, ,మీరు నిర్ణయించే ధర వంటి విషయాలపై స్పష్టత కలిగి ఉంటె , స్థానిక మార్కెట్‌లో బాగా లాభాల స్థాయిని పెంచుకోవచ్చు ," అని Ms కాన్నెల్ అంటున్నారు.
Customer shops for bike
Business can be operated as a sole trader, company, or partnership. Credit: Superb Images/Getty Images

ఆర్ధిక సహాయం

మీ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఆర్థిక సహాయం, ఆస్ట్రేలియా ప్రభుత్వం అనేక విధాలుగా అందిస్తుంది. కన్నెల్ వివరిస్తూ గ్రాంట్లు, రుణాలు మరియు ప్రైవేట్ పెట్టుబడిదారులతో సహా సామర్ధ్యం కలిగిన వ్యవస్థాపకులకు అందుబాటులో ఉన్న వివిధ ఫైనాన్సింగ్ అవకాశాలను తెలిపారు.

" రాష్ట్ర మరియు స్థానిక కౌన్సిల్ పరంగా ప్రభుత్వం 70 బిలియన్లకు పైగా నిధులను అందుబాటులో ఉంచిందని " ఆమె చెప్పారు.

Ms కన్నెల్ కూడా ఆస్ట్రేలియన్ ప్రభుత్వ వెబ్‌సైట్, bussiness.gov.au, గ్రాంట్లు మరియు ప్రోగ్రామ్ ఫైండర్ ట్యాబ్ ద్వారా వివిధ పరిశ్రమలకు తగ్గ సమాచారం ఉందని తెలిపారు. "ప్రజలు వాటి ద్వారా తెలుసుకోవచ్చు, కానీ వాటిలో రాష్ట్ర ప్రభుత్వాలకు సంబందించినవి కూడా ఉన్నాయి. ఆన్లైన్లో అన్ని స్టేట్ గవర్నమెంట్ వెబ్సైట్లూ, గ్రాంట్లు నమోదు చేయబడి ఉన్నాయి. ఆపై మీ స్థానిక కౌన్సిల్ దగ్గర కూడా మీరు గ్రాంట్‌ల కోసం సంప్రదించవచ్చని ," అని ఆమె చెప్పారు.

మరింత సమాచారం కోసం మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు. ఆస్ట్రేలియా పారిశ్రామికవేత్తలకు వనరుల నిధులను మరియు ప్రభుత్వ మద్దతును అందిస్తుంది. ఉదాహరణకి, NSW లో కొత్త వ్యాపారం మొదలుపెడితే దానికి కావాల్సిన సహాయం చేస్తారని కాసాండ్రా గిబ్బెన్స్ అన్నారు.

Image.jfif
Nadine Connell - Director of Smart Business Plans Australia
మాట్లాడుతూ - చిన్న వ్యాపారాలను ప్రారంభించడానికి, నడపడానికి, ఎదగడానికి మరియు ఉచితంగా బదిలీ చేసుకోవాలన్నా వారు మద్దతు ఇస్తారని చెప్పారు.
వ్యాపార పరిస్థితులను బట్టి మీకు ఏవిధమైన సహాయం అవసరమో తెలుసుకొని ఉచితంగా మద్దతు ఇస్తామని తెలిపారు .
Cassandra Gibbens
మా వ్యాపార సేవల ద్వారా వివిధ ప్రభుత్వ రంగాలలో స్టార్ట్-అప్ వ్యాపారాల కోసం అందుబాటులో ఉన్న ఆర్థిక సహాయంపై సమాచారాన్ని కనుగొనడంలో వ్యాపారాలకు సహాయాన్ని అందిస్తుంది .

వారు ఫైనాన్స్‌ని ఎలా పొందాలి, గ్రాంట్లు, రుణాలు మరియు ప్రైవేట్ పెట్టుబడిదారులతో ఎలా సంప్రదించాలి,వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవసరమైన ప్రతిదానిపై సమాచారాన్ని Business Concierge వారు అందించగలరని గిబ్బెన్స్ వివరించారు.

Share