2025 సంవత్సరానికిగాను ఆస్ట్రేలియాలో చదువుకోవడానికి కేవలం రెండు లక్షల డెబ్బై వేల విదేశీ విద్యార్థలకు మాత్రమే అనుమతి లభిస్తుంది. ఈ రెండులక్షల డెబ్బైవేలలో, లక్షా నలభై ఐదువేల సీట్లను ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకు, 95వేల సీట్లను వృత్తివిద్యలను అందించే సంస్థలకు ప్రభుత్వం కేటాయించింది. మిగిలిన 30వేల సీట్లను మిగిలిన విశ్వవిద్యాలయాలు, ఉన్నతవిద్యలను అందించే అనుబంధ సంస్థలు పంచుకుంటాయి.
ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ఆస్ట్రేలియాలో చదువుకోవలనుకునే విదేశీ విద్యార్థులు అశనిపాతంలా మారనుంది. గత సంవత్సరంతో పోలిస్తే సీట్ల సంఖ్య 53వేల దాకా తగ్గే అవకాశముంది. కాగా, విదేశీ విద్యారంగం సమగ్రతను కాపాడటానికే ఈ చర్యలు చేపట్టనున్నామని ప్రభుత్వం అంటోంది.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.