Key Points
- లూనార్ న్యూ ఇయర్ చైనా మరియు ఇతర తూర్పు ఆసియా దేశాలలో జరుపుకునే ఒక ముఖ్యమైన సాంస్కృతిక పండగ.
- సిడ్నీ లూనార్ న్యూ ఇయర్ వేడుకలు ఆసియా వెలుపల బాగా ప్రసిద్ధి చెందాయి.
- లూనార్ న్యూ ఇయర్ డే ప్రతి సంవత్సరం మారుతుంది, ఇది జనవరిలో కొన్నిసార్లు మరియు ఫిబ్రవరిలో ఇతర సమయాల్లో వస్తుంది.
న్యూ ఇయర్ సెలబ్రేషన్స్¬లో నాలుగు అంశాలు ఉంటాయి. వారు ఒక వారం లిటిల్ ఇయర్, స్మారక మరియు ప్రార్థన రోజుతో, తరువాత కొత్త సంవత్సరం సాయంత్రాన్ని తిరిగి కలవడానికి మరియు బహుమతి ఇచ్చే రోజుగా జరుపుకుంటున్నారు.
యూనివర్సిటీ ఆఫ్ న్యూ సౌత్ వేల్స్లో చైనీస్ అండ్ ఏషియన్ స్టడీస్ సీనియర్ లెక్చరర్ డాక్టర్ పాన్ వాంగ్ మాట్లాడుతూ స్ప్రింగ్ ఫెస్టివల్ లాంతర్ ఫెస్టివల్ వరకు పదిహేను రోజుల పాటు ఉంటుందని వివరించారు.
'లూనార్ న్యూ ఇయర్ అనేది లూనార్ క్యాలెండర్ సంవత్సరం ప్రారంభం అని అంటారు. మూన్ సైకిల్స్ ఆధారంగా దీన్ని చైనీస్ న్యూ ఇయర్ లేదా స్ప్రింగ్ ఫెస్టివల్ అని కూడా పిలుస్తారు" అని ఆమె చెప్పారు.
"ఇది చైనా,కొరియా, వియత్నాం మరియు జపాన్ వంటి ఇతర తూర్పు ఆసియా దేశాలలో జరుపుకుంటారు" అని డాక్టర్ వాంగ్ వివరించారు.
మలేషియా మరియు మంగోలియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది దీనిని జరుపుకుంటారు.
లూనార్ న్యూ ఇయర్¬కు జియా మరియు షాంగ్ రాజవంశం యొక్క 4,000 సంవత్సరాల చరిత్ర ఉందని డాక్టర్ వాంగ్ చెప్పారు.

Chinese dancers perform during the Sydney Lunar Festival Media Launch at the Chinese Garden of Friendship in Sydney on February 9, 2021. Source: AAP / AAP Image/Bianca De Marchi
"ఆగ్నేయ మరియు తూర్పు ఆసియా సంస్కృతుల గురించి తెలుసుకునే అవకాశం"
డాక్టర్ కై జాంగ్ కాన్బెర్రాలోని ఆస్ట్రేలియన్ నేషనల్ యూనివర్శిటీలోని స్కూల్ ఆఫ్ కల్చర్, హిస్టరీ అండ్ లాంగ్వేజ్లో మోడ్రన్ చైనీస్ లాంగ్వేజ్ ప్రోగ్రామ్తో కలిసి పనిచేస్తున్నారు.
చైనీస్, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా సంస్కృతుల గురించి తెలుసుకోవడానికి ఆస్ట్రేలియాలో లూనార్ న్యూ ఇయర్ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు ఒక అద్భుతమైన అవకాశం అని ఆమె చెప్పారు.
"ఇది సుదీర్ఘ చరిత్ర కలిగిన సాంస్కృతిక సంఘటన మరియు దానిలో నిక్షిప్తమైన చాలా గొప్ప, ప్రతీకాత్మక అర్థం కలిగి ఉంది" అని ఆమె చెప్పారు.
లూనార్ న్యూ ఇయర్ పండగను చేసుకునే పద్ధతులు
- ఇల్లంతా అలంకరించడం
- న్యూ ఇయర్ సాయంత్ర వేళ కుటుంబంతో కలిసి డిన్నర్ చేయడం.
- ఎర్రటి కవర్ల లో బహుమతులను ఇచ్చి పుచ్చుకోవడం.
- బాణసంచా కాల్చడం, టపాసులను పేల్చడం.
- సింహం, డ్రాగన్ డాన్స్¬లను చూడటం.
"లూనార్ న్యూ ఇయర్ రోజున మంచి వంటలను చేసుకోడం , చేపలు తినడం, డంప్లింగ్స్ తినడం, కుటుంబాలతో మరియు స్నేహితులతో కలిసి ఆనందంగా జరుపుకుంటారని" డాక్టర్ వాంగ్ వివరించారు.
'ఎరుపు రంగును వారు చాలా అదృష్ట రంగుగా భావిస్తారు. కాబట్టి మీరు ఎరుపు రంగు అలంకరణలను చాలా చూస్తున్నప్పటికీ, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి పిల్లలకు ఎరుపు రంగు ఎన్వలప్¬ను ఇవ్వడం చైనీయులకు ఒక సంప్రదాయం.
చైనాలో పెరిగిన ఐరిస్ టాంగ్ 20 ఏళ్ల క్రితం ఆస్ట్రేలియాకు వచ్చారు.
ఆస్ట్రేలియా మరియు చైనా వేడుకల మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే, చైనా లో , లూనార్ న్యూ ఇయర్ వేడుకలకు అనుగుణంగా ఎక్కువ సెలవు రోజులు ఉంటాయని - ఇది వందల మిలియన్ల మంది కుటుంబాల వారు చైనాలోని వారి స్వస్థలాలకు ప్రయాణించే సమయం.
టాంగ్ ప్రకారం, చైనాలో మాదిరిగా ఆస్ట్రేలియాలో లూనార్ న్యూ ఇయర్ వేడుకలలో కూడా ఆహారమే ప్రధానమైనది.
'కాన్ బెర్రాలో మా కుటుంబం, స్నేహితులతో కలిసి ఎక్కువ మొత్తం లో వివిధ రకాలైన వంటకాల్ని తయారు చేసి పండగ చేసుకుంటాము. మేము టేబుల్ చుట్టూ కూర్చుని న్యూ ఇయర్ వేడుకల కోసం వందలాది డంప్లింగ్స్ ను తయారు చేస్తాము. మిగిలిన వాటిని నూతన సంవత్సర వేడుకల తరువాత కూడా తింటాము " అని టాంగ్ చెప్పారు.

చైనీస్ సంప్రదాయ క్యాలెండర్
ఆధునిక చైనా గ్రెగోరియన్ క్యాలెండరును ఉపయోగిస్తున్నప్పటికీ, సాంప్రదాయ చైనీస్ క్యాలెండర్ చైనాలో మరియు విదేశీ చైనీయులలో కూడా విస్తృతంగా ఉపయోగించబడుతుంది, ఎందుకంటే ఇది లూనార్ చైనీస్ న్యూ ఇయర్, లాంతర్ ఫెస్టివల్ మరియు క్వింగ్మింగ్ ఫెస్టివల్ వంటి సాంప్రదాయ రోజులను చూపిస్తుంది.
వివాహాలు, అంత్యక్రియలు, వ్యాపారాన్ని ప్రారంభించడానికి శుభదినాలను చూసుకోవడానికి, ఉపయోగపడుతుందని డాక్టర్ పాన్ వాంగ్ వివరించారు.
చైనీస్ సంప్రదాయ క్యాలెండర్ లూనార్-సోలార్. ఇది చంద్రుడు మరియు సూర్యుడి కదలికలు బట్టి నిర్ణయించబడుతుంది , కాబట్టి ఇది భూమి చుట్టూ చంద్రుడి కక్ష్య మరియు సూర్యుడి చుట్టూ భూమి యొక్క కక్ష్య రెండింటినీ పరిగణనలోకి తీసుకుంటుంది.
''ఈ క్యాలెండర్¬లో నెల ప్రారంభం చంద్రుడి దశను బట్టి నిర్ణయిస్తారు. కాబట్టి చాలా చాంద్రమాన క్యాలెండర్లలో మాదిరిగా, నెలలు 29 లేదా 30 రోజులు ఉంటాయి మరియు సంవత్సరం ప్రారంభం సౌర సంవత్సరం ద్వారా నిర్ణయించబడుతుంది" అని డాక్టర్ వాంగ్ చెప్పారు.
సాంప్రదాయ చైనీస్ క్యాలెండర్ ను తూర్పు ఆసియా అంతటా ఉపయోగిస్తారు.
లూనార్ నూతన సంవత్సరం రోజు ప్రతి సంవత్సరం జనవరి లేదా ఫిబ్రవరిలో వస్తుంది.
లాంతరు పండుగ
లూనార్ న్యూ ఇయర్ వేడుకలు సాంప్రదాయకంగా రెండు వారాల పాటు జరుపుకుంటారు, లూనార్ న్యూ ఇయర్ సాయంత్రం నుండి లాంతర్న్ ఫెస్టివల్ వరకు మరియు లూనార్ సంవత్సరంలోని పదిహేనవ రోజున చేసుకుంటారని డాక్టర్ కై జాంగ్ వివరించారు.
చైనీస్ క్యాలెండర్ ప్రకారం, లాంతర్ ఫెస్టివల్ మొదటి నెలలో పదిహేనవ రోజుతో కలిసి వస్తుంది.
"దీనిని లాంతర్ ఫెస్టివల్ అని పిలుస్తారు, ఎందుకంటే ఈ రోజున కుటుంబాలు తమ పిల్లల కోసం చిన్న లాంతర్లను తయారు చేసి తలుపుల వెలుపల లాంతర్లు వెలిగిస్తారు" అని ఆమె చెప్పారు.
"అంతక మునుపు , టాంగ్ రాజవంశం ప్రారంభంలో, ఈ రోజున పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిపేవారు."

Source: AAP / AAP Image/Jeremy Ng
"పెద్దలకు గౌరవం ఇవ్వాల్సిన సమయం."
"పెద్దలకు గౌరవం ఇవ్వాల్సిన సమయం."
డాక్టర్ క్రెయిగ్ స్మిత్ మెల్బోర్న్ విశ్వవిద్యాలయంలోని ఆసియా ఇన్స్టిట్యూట్¬లో ట్రాన్స్లేషన్ స్టడీస్ (చైనీస్) లో సీనియర్ లెక్చరర్.
కొన్నేళ్లుగా తైవాన్, దక్షిణ కొరియాల్లో నివసిస్తున్న ఆయనకు లూనార్ న్యూ ఇయర్ పండుగ గురించి వారి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.
దక్షిణ కొరియాలో లూనార్ న్యూ ఇయర్ రోజున పూర్వీకులను గౌరవిస్తామని ,ఇది ఇతర సంస్కృతులు వారు కూడా ఇలా పాటిస్తున్న సాంప్రదాయమని డాక్టర్ స్మిత్ చెప్పారు.
"కొత్త సంవత్సరం రోజున, ప్రతి ఒక్కరూ చనిపోయిన వారి పెద్దలకు అన్న పానీయాలను సమర్పించి వారికి నివాళులు అర్పిస్తారు" అని డాక్టర్ స్మిత్ చెప్పారు.
"ఇది వేల సంవత్సరాల చరిత్ర."
లూనార్ న్యూ ఇయర్ యొక్క సాంప్రదాయ వేడుకలలో చాలా అంశాలు చైనావి కాకుండా ఇతర దేశాల నుండి వచ్చాయని డాక్టర్ స్మిత్ చెప్పారు.
ఉదాహరణకు, లూనార్ న్యూ ఇయర్ పరేడ్ల సమయంలో సాంప్రదాయకంగా ప్రదర్శించబడే సింహం నృత్యం (lion dancing) విషయంలో ఇది జరుగుతుంది.
"విద్యావేత్తలు ఈ సింహ నృత్య సంప్రదాయాన్ని చూసినప్పుడు, వారు వాస్తవానికి వేల సంవత్సరాల క్రితం పశ్చిమ లేదా మధ్య ఆసియా దేశాలు అని పిలువబడే దాని నుండి, ముఖ్యంగా ప్రసిద్ధ సిల్క్ రోడ్డు ద్వారా చాలా సంప్రదాయాలు, మతాలు, సంగీతం, కళలు చైనాలోకి వచ్చాయని " అని డాక్టర్ స్మిత్ వివరించారు.
ఈ సంప్రదాయానికి చైనా బయట కూడా కొన్ని మూలాలు ఉండవచ్చు. భాషా మరియు చారిత్రక విశ్లేషణ ఆధారంగా చాలా మంది దీనిని పర్షియన్ సంప్రదాయాలతో అనుసంధానించారు.
చైనీస్ రాశిచక్ర సంవత్సరం లూనార్ న్యూ ఇయర్¬తో ప్రారంభమై ముగుస్తుంది.
12 సంవత్సరాల పునరావృత రాశి చక్రంలో ప్రతి సంవత్సరం ఒక రాశి జంతువు ద్వారా ప్రాతినిధ్యం వహిస్తుంది, ప్రతి ఒక్కటి దాని ప్రసిద్ధ లక్షణాలతో ఉంటాయి. వాటిలో ఎలుక, ఎద్దు, పులి, కుందేలు, డ్రాగన్, పాము, గుర్రం, మేక, కోతి, కోడి, కుక్క మరియు పంది తో ఈ రాశులను సూచిస్తారు.