ఫస్ట్ నేషన్స్ ప్రజల ప్రసిద్ధ నేత కళ ప్రాముఖ్యత తెలుసా?

Australia Explained: First Nations weaving - Aboriginal craftswoman splitting pandanus for weaving

Ramingining, Arnhem Land, Northern Territory, Australia, 2005. Credit: Penny Tweedie/Getty Images

నేత వృత్తి ఫస్ట్ నేషన్స్ ప్రజల ప్రసిద్ధ కళ . వారు వస్తువులకు అందాన్ని చేకూర్చడంతో పాటు వారి విజ్ఞానాన్ని పంచుకుంటూ భవిష్యత్ తరాలకు బాట వేస్తున్నారు.


Key Points
  • నేతకు సంబంధించి వారు తెలుసునే కధలు ద్వారా వారి పూర్వీకులతో బంధం పెరుగుతుంది.
  • నేత వారి ఏకాగ్రతను కనబరిచే విధానం.
  • నేత నేసేవారి పనితీరును బట్టి వారి నైపుణ్యాన్ని గుర్తించవచ్చు.
  • పురుషులు మరియు మహిళలు అందరూ నేయగల సామర్ధ్యం ఉన్నవారే.
వారు నేసిన వస్తువులు చాలా విభిన్నంగా ఉంటాయి. ముడి సరుకులుగా రెల్లు, బెరడు మరియు మొక్కలు వంటి స్థానిక వనరులను సేకరించిన తరువాత నేత నేయడం ప్రారంభిస్తారు. బుట్టలు, గిన్నెలు, తాడు మరియు వలలు వంటి అందమైన వస్తువులను వారు తయారుచేస్తారు. నేత అనేది ఒక్క పదం మాత్రమే. వారి మాతృభాషలో దీనికని అనేక పదాలతో వర్ణిస్తారు ” ఉత్తర NSWకి చెందిన గోమెరోయ్ మహిళ, చెరీ జాన్సన్ కళాకారిణి మరియు విద్యావేత్త. ఆమె వివరిస్తూ ఈ నేత పనిలో ప్రాముఖ్యమైన విషయం మొక్కలను ఎంచుకోవడమేనని మరియు ఏ సమయంలో మరియు ఏ పంటను ఈ నేతకు అనువుగా ఉంటుందో చెప్పడం బట్టే వారు ఈ వృత్తిలో ఎంత ప్రజ్ఞ కలిగి ఉన్నవారో తెలుస్తుందని చెప్పారు.
AFLW Rd 8 - Yartapuulti v Gold Coast
ADELAIDE, AUSTRALIA: An Indigenous weaving workshop takes place in The Precinct Village an AFLW match. Credit: Kelly Barnes/AFL Photos/via Getty Images

నేత వారిని కలిపే కుటుంబ బంధం

నేయడం అంటే ఒక్క అల్లడమే కాదు. అందరూ కలిసి కూర్చొని దానికి సంబంధించిన కధలను చెప్పుకుంటూ దాని వెనుక ఉన్న సాంస్కృతిక జ్ఞానాన్ని నేర్చుకుంటారు.“తయారు చేసే వస్తువు లో ప్రతి చిన్న ముడి యొక్క ప్రాముఖ్యతను తెలుసుకొని వారు నేస్తారని" జాన్సన్ చెప్పారు.

మహిళలలో పాటు పురుషులు కూడా ఈ కళను నేర్చుకుంటారు

ల్యూక్ రస్సెల్ NSWలోని న్యూకాసిల్ ప్రాంతంలో వోరిమి కస్టోడియన్ వారు. తను పూర్వీకుల దగ్గర నేర్చుకున్న సాధనాల తయారీ జ్ఞానాన్ని ఇతరులకు అందించడానికి సాంప్రదాయ బెరడు పడవలు, చేపలు పట్టే స్పియర్‌లు మరియు ఇతర సాధనాలను తయారు చేస్తుంటారు. అయన తయారుచేసిన పడవలను భద్రపరచడానికి లేదా నేసిన తాడుతో పనిముట్లను కట్టి ఉంచడానికి సరికొత్త నేత పద్ధతులను ఉపయోగిస్తారు.

మగవారు నేతను వారి బాల్యం నుండి యుక్తవయస్సు లోపు నేర్చుకోవాలని మరియు వారు ఇంట్లో తల్లి దగ్గర కలిసి నేయడం నేర్చుకుంటారని రస్సెల్ చెప్పారు.
Australia Explained: First Nations weaving -  pandanus palm fibre mats
Credit: Richard I'Anson/Getty Images

నేత మనసుకు ప్రశాంతత కలిగించే కళ

చెరీ జాన్సన్ మాట్లాడుతూ మనసుతో వారు నేత నేస్తారని అన్నారు. అందరూ కలిసి కుటుంబసమేతంగా ఇష్టపడి, మా ఆలోచనలకు పదును పెట్టి నేస్తామని అన్నారు.

భిన్నమైన శైలి

ఒక్కో ప్రాంతంలో లభించే చెట్లు, పువ్వులు మరియు గడ్డితో అందంగా తీర్చిదిద్దడంతో వస్తువులు మరింత ఆకర్షణగా ఉంటాయని చెప్పారు. పువ్వులు, బెరడులు, రసాలు లేదా వేర్లు నుండి తయారు చేసిన స్థానిక రంగులను వాడతారు.

కొన్నిసార్లు, వస్తువు బట్టి ఆ పని ఏ కళాకారునిదో గుర్తించవచ్చు. ఉత్తర క్వీన్స్‌ల్యాండ్‌లోని కార్డ్‌వెల్ ప్రాంతానికి చెందిన గిర్రామేలో నెఫి డెనమ్ కు వారి మావయ్య నేతను నేర్పించాడు. అయనతో పాటు నేర్చుకున్న అందరూ, వ్యాపారాలను ప్రారంభించారని డెనమ్ చెప్పారు.

నేసిన వస్తువు చివర అల్లికను చూసి దాని వివరాల చెప్పే సామర్ధ్యత ఉంటుందని చెప్పారు.
Australia Explained: First Nations weaving - Woman weaving basket with pandanus palm fibre
Credit: Richard I'Anson/Getty Images

మనం పాల్గొనాలంటే??

కాస్సీ లీథమ్ విక్టోరియాలోని కులిన్ ప్రాంతానికి చెందిన టౌంగురుంగ్ నేత కుటుంబానికి చెందినవారు. ఆమె ఇతర వర్గాల వారికీ వర్క్‌షాప్‌లను ఏర్పాటు చేస్తుంటారు. నేర్చుకునే ముందు వారి పట్ల గౌరవంతో మెలుగుతూ వారి పూర్వీకుల కళను నేర్చుకుంటున్నందుకు కృతజ్ఞ లో ఉండలని కోరారు. మీరు నేర్చుకున్న కళను ప్రదర్శించే ముందు వారికీ ప్రాధాన్యతనిస్తూ గౌరవించడం ముఖ్యమని లీథమ్ చెప్పారు.

ఇది కట్టుబడి పాటించాల్సిన పద్దతి కాదు కానీ, వారి విజ్ఞానాన్ని అందరితో పంచుకున్న వారికీ గుర్తింపు లభించాలనే ప్రయత్నమిది.మీరు ఫస్ట్ నేషన్స్ నేతృత్వంలోని నేత సంఘాలు జరుపుకునే పండుగలను తెలుసుకోవచ్చు. వర్క్‌షాప్‌లు తరచుగా స్థానిక కౌన్సిల్‌ల ద్వారా, సోషల్ మీడియాలోను ప్రచారం చేయబడతాయి.

మీరు ఈ కళాఖండాలను చూడాలంటే?

ఆస్ట్రేలియా అంతటా గ్యాలరీలను ఏర్పాటు చేస్తారు. ప్రైవేట్ మరియు పబ్లిక్ ప్రదేశాలలో నేత వస్తువులను ప్రదర్శిస్తూ అమ్ముడు చేస్తారు. గ్యాలరీలు ద్వారా ఫస్ట్ నేషన్స్ సంస్కృతులు మరియు పర్యావరణాల వైవిధ్యాన్ని ప్రదర్శించడమే వారి ముఖ్య ఉద్దేశం.

ప్రాచీన కళ సంస్కృతీ తో పాటు ప్రస్తుతపు కళలు అబివృద్ది మరియు భవిష్యత్తు తాము సాధించే పురోగతి కనపడుతుందని" కాస్సీ లీథమ్ చెప్పారు.

Share