నీటి ప్రమాదాలు.. మునిగిపోవడం వంటివి నివారించడం ఎలా?

Rivers can be remote and are unsupervised Source: Source: Mark Kolbe/Getty Images

Rivers can be remote and are unsupervised Source: Source: Mark Kolbe/Getty Images

ప్రతి సంవత్సరం ప్రపంచ వ్యాప్తంగా వేలాది మంది నీటి ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా వలస వచ్చిన ప్రజలు మరియు వారి కుటుంబాలు ఈ ప్రమాదాలకు గురవుతున్నారు. స్విమ్మింగ్ నేర్చుకోవడం ద్వారా, నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాలను నివారించడం మాత్రమే కాకుండా, మీ కుటుంబాన్ని కూడా రక్షించుకోవచ్చు.


దీనిపై మాట్లాడేందుకు SBS తెలుగు వారు రాయల్ లైఫ్ సేవింగ్ ఆస్ట్రేలియా లో నేషనల్ మేనేజర్ గా పనిచేస్తున్న స్టేసీ పిడ్జన్ ను ఇంటర్వ్యూ చేసారు. నీటి ప్రమాదాలను అరికట్టేందుకు మరియు సురక్షితంగా ఉండేందుకు పాటించవలసిన చిట్కాలను తెలుసుకోండి.
  • నీటి దగ్గర పిల్లలను ఎల్లప్పుడూ పర్యవేక్షించండి.
  • మద్యం తాగి నీటిలోకి వెళ్లవద్దు.
  • పడవలో లేదా చేపలు పడుతున్నప్పుడు లైఫ్ జాకెట్ ధరించండి.
  • ఒంటరిగా నీటిలోకి వెళ్లకండి.
  • wనీటి పరిస్థితులను తెలుసుకోండి.
అత్యవసర పరిస్థితుల్లో 000 ను సంప్రదించండి. మరిన్ని విషయాలను మరియు ను సందర్శించండి.SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.


Share