సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ వరదలు, ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను అతలాకుతలం చేశాయి. ముఖ్యంగా విజయవాడ మరియు ఖమ్మం నగరాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. ఇప్పటికీ విజయవాడ నగరంలోని ప్రజలు ఈ వరద ప్రభావం నుంచి పూర్తిగా బయటపడలేదు. 24 గంటల్లోనే అసాధారణ వర్షపాతం నమోదవ్వడం, 40 వేలు క్యూసెక్కుల వరద ప్రవాహం కారణంగా అజిత్ సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, పైకాపురం, ప్రకాశ్ నగర్ మరియు బుడమేరు పరివాహక ప్రాంతాలు వరద నీటిలో మునిగిపోయాయి. ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, జరిగిన సహాయక చర్యల గురించి మరింత తెలుసుకుందాం.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.