ప్రపంచం మెచ్చిన యోగా

Yoga day.png

International Yoga Day, celebrated annually on June 21st, highlights the numerous benefits of practicing yoga for physical and mental well-being. Credit: Saraswathi & Suseela

మారుతున్న జీవిత ప్రమాణాలు, పని ఒత్తడి, అందరిలో మానసిక ఆందోళన కల్గిస్తున్నాయి. మానసిక ఉల్లాసానికి, ఉత్తేజానికి మందే యోగా. ప్రపంచ వ్యాప్తంగా అందరిని ఆకర్షిస్తున్న యోగా దాదాపు ఐదు వేల సంవత్సరాలుగా భారతీయ సంస్కృతిలో మమేకమైంది. ఇది నేడు ప్రపంచ దృష్టిని కూడా ఆకర్షించింది.


భారతీయ సంస్కృతిలో, ఆథ్యాత్మిక చింతనలో భాగమైన యోగా విశిష్టతను నేడు యావత్తు ప్రపంచం గుర్తించి, ఆచరిస్తోంది. అంతేకాకుండా, ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటోంది. 2014లో ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించిన సందర్భంలో అంతర్జాతీయ యోగా దినోత్సవ ఆలోచనను ప్రతిపాదించారు. దానికి ప్రపంచంలోని 175 దేశాలు మద్దతు పలకటంతో ‘యోగా ఫర్ హ్యుమానిటీ’ అన్న నినాదంతో మొట్టమొదటిసారిగా 2015 జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకున్నారు.

జూన్ 21నాడు ఉత్తరార్థ గోళంలో (అంటే నార్తరన్ హెమిస్పియర్ లో) పగటి సమయం ఎక్కువ. సూర్యునితో అనుసంధానమైన యోగాను ఆ ప్రత్యేక దినాన జరుపుకోవాలన్న మోదీ సూచనను ఐక్యరాజ్య సమితి ఆమోదించింది. న్యూఢిల్లీలో జరిపిన మొట్టమొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవానికి 84 దేశాల నుంచి ఆయా దేశాల నేతలు, దౌత్యవేత్తలు హాజరయ్యారు. మొత్తం 35, 985మంది సమిష్టిగా యోగా కార్యక్రమంలో పాల్గొని ఆసనాలు వేసి గిన్నీసు రికార్డు నెలకొల్పారు.

చాలామంది మనలో అనేకానేక వ్యాయామాలు చేస్తారు. అయితే ఈ వ్యాయామాలన్ని శరీరధారుఢ్యాన్ని పెంచడానికి ఉపయోగిస్తాయి కానీ, ఆరోగ్యాన్ని వృద్ధి చేయవు. ఆసనాలు కొన్ని నిలబడి, కొన్ని కూర్చుని, మరికొన్ని పడుకుని చేయటం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరము నూతనోత్సాహాన్ని పొందుతుంది. మనకి స్ఫూర్తిని, శరీరానికి ఉత్తేజాన్ని కల్గించే ఈ యోగా యొక్క ప్రాధాన్యతను, చేసే విధానం మరియు ఆహార నియమాలు వంటి పలు ప్రశ్నలను ఈ శీర్షికలో చర్చించడం జరిగింది .

హైద్రాబాదుకు చెందిన శ్రీమతి గండేపల్లి సుశీలగారు 43 ఏళ్లగా యోగా సాధన చేయటంతోపాటు ప్రకృతివైద్యంలో కూడా శిక్షణ పొందారు. అలానే ఇషా యోగా సెంటర్ లో వాలంటీర్ గా పనిచేస్తున్న రాంకీగారు 12 ఏళ్లగా యోగ సాధన చేస్తున్నారు. ఆస్ట్రేలియా అంతటా పలు ఉచిత తరగతులను కూడా నిర్వహిస్తున్నారు. యోగ గొప్పదనాన్ని తెలుసుకొని తప్పకుండా మన దైనందన జీవితంలో ఉండేలా చూసుకోవాలని సలహా ఇస్తున్నారు. IT లో పనిచేస్తున్న సరస్వతి మాట్లాడుతూ, పెరుగుతన్న వత్తిళ్లకు యోగా మానసికంగా దృఢంగా ఉండేందుకు ఎంత సహాయపడిందో తెలియజేస్తున్నారు.
 
ఈ సంవత్సరం ‘యోగాతో నేను, సమాజం’ (యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటి) అనే నినాదంతో జరుపుకోనున్న ‘యోగా డే’ సందర్భంగా మన ఆస్ట్రేలియాలో కూడా పలుచోట్ల అంతర్జాతీయ యోగా దినోత్సవాలను, వేడుకలను ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో ప్రధానంగా ---
 

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కార్యక్రమాలు

  1. కాన్బెరా - ఇండియన్ హై కమీషన్
    • తేదీ & సమయం: 🗓️ జూన్ 22, 2024, 🕙 ఉదయం 10:00 నుండి 11:00 వరకు
    • సంస్థ: 🏛️ ఇండియన్ హై కమీషన్
    • వివరాలు: 🧘‍♀️ మల్లికా రాజ్ ద్వారా యోగా మరియు ధ్యానం క్లాసులు.
  2. సిడ్నీ - సిడ్నీ కాన్సులేటర్ జనరల్ ఆఫ్ ఇండియా
    • తేదీ & సమయం: 🗓️ జూన్ 22, 2024, 🕚 ఉదయం 11:00 నుండి
    • సంస్థ: 🏛️ సిడ్నీ కాన్సులేటర్ జనరల్ ఆఫ్ ఇండియా, 🧘‍♂️ స్వామి వివేకానంద కల్చరల్ సెంటర్, ది ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్
    • వివరాలు: 🎉 సెయింట్ మేర్సీ కాథడ్రియల్ బయట మైదానంలో యోగా డే ఉత్సవాలు.
  3. పెర్త్ - కాన్సులేటర్ జనరల్ ఆఫ్ ఇండియా
    • తేదీ: 🗓️ జూన్ 23, 2024
    • సంస్థ: 🏛️ పెర్త్ కాన్సులేటర్ జనరల్ ఆఫ్ ఇండియా, 🇮🇳 ఇండియన్ సొసైటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా, ది ఆర్ట్ ఆఫ్ ఇండియా
    • వివరాలు: 🌞 పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం, 👶 పిల్లల కోసం ప్రత్యేక యోగా సెషన్.
  4. బ్రిస్బేన్ - యోగా వర్క్ షాపులు
    • తేదీ & సమయం: 🗓️ జూన్ 23, 2024, 🕥 ఉదయం 10:30 నుండి సాయంత్రం 5:00 వరకు
    • సంస్థ: 🏛️ ఆస్ట్రేలియన్ స్కూల్ ఆఫ్ మెడిటేషన్ అండ్ యోగా
    • వివరాలు: 🌿 యోగా వర్క్ షాపులు మరియు ఇతర కార్యక్రమాలు.

ఈ కార్యక్రమాలు యోగాపై మీకున్న ఆసక్తిని మరింతగా పెంచుతాయి మరియు ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించడానికి మార్గం చూపుతాయి. అందరికీ ఆహ్వానం!

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.

Share