మెల్బోర్న్ మూంబా ఫెస్టివల్‌.. 90 మంది కళాకారుల అద్భుత పెరేడ్ – తెలుగు పాట హైలైట్..

Moomba Festival.png

Melbourne's annual Moomba festival welcomed thousands of visitors to the Yarra River banks during the Labour Day long weekend. Pallavi Surapaneni's team performed in the parade, with the Telugu song "Kurchini Madatapetti" being the highlight. Credit: Supplied

ప్రతి ఏడాది లాగే, ఈ సంవత్సరం కూడా మెల్బోర్న్ నగరం అంగరంగ వైభవంగా మూంబా ఫెస్టివల్‌ను జరుపుకుంది. పిల్లల నుంచి పెద్దల వరకూ ఎంతో ఉత్సాహంగా పాల్గొనే ఈ ఉత్సవం, ప్రతి ఏటా లేబర్ డే లాంగ్ వీకెండ్ సమయంలో నిర్వహిస్తారు . అద్భుతమైన రైడ్లు, నోరూరించే వంటకాలు, అద్భుతమైన సాంస్కృతిక ప్రదర్శనలతో యార్రా నదీ తీరాన్ని సందడిగా మార్చే ఈ వేడుక, 1955లో ప్రారంభమై ఈ సంవత్సరం 70వ ఏట అడుగుపెట్టింది.


ఇందులో ప్రధాన ఆకర్షణ అయిన పెరేడ్లో .. ఈసారి మన తెలుగువారైన పల్లవి సురపనేని గారు .. వారి 90 మంది కళాకారులు బృందంతో పాల్గొని తెలుగు పాటను ప్రదర్శించారు . "కు కు కు... కూర్చుని మడతపెట్టీ..." అంటూ, మన సాంస్కృతిక వైభవాన్ని ప్రదర్శించారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి ..SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.

Share