భోజనం అని అర్థం కలిగిన బోనం దేవికి సమర్పించే నైవేద్యం. మహిళలు వండిన పరమాన్నం, పచ్చిపులుసన్నం కలిగిన బోనాన్ని మట్టి లేదా రాగి కుండలలో తలపై పెట్టుకుని, గుడికి వెళ్తారు. మహిళలు తీసుకెళ్లే ఈ బోనాల కుండలను చిన్న వేప రెమ్మలతో, పసుపు, కుంకుమతో అలంకరించి, దానిపై ఒక దీపంతో దేదీప్యమానంగా అలంకరిస్తారు.
దీని గురించి మరిన్ని విషయాలను వాణి చింతపల్లి గారు మరియు పుస్కూరు మానస గారు, మెల్బోర్న్ జాతర టీం నుండి వారు ఈ పండగను ఎలా నిర్వహించనున్నారో తెలియజేస్తున్నారు.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.