దీని ద్వారా ఇప్పటికే 500 మందికి పైగా తెలుగు పిల్లలు "తెలుగు" నేర్చుకుంటున్నారు. ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో, ఆంగ్లాన్ని విరివిగా వాడే క్రమంలో పిల్లలు మాతృభాషను మర్చిపోకుండా, మన సంప్రదాయాలను అలవర్చుకునేలా ఈ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతోంది. నమోదు చేసుకోవాలనుకునేవారు వారిని సంప్రదించండి. అలానే వారు చేస్తున్న కృషిని ఈ శీర్షిక ద్వారా మరింత తెలుసుకుందాం.
ప్రస్తుతం వారి VSL సెంటర్లు బల్లారాట్ (Ballarat), బెర్విక్ (Berwick), గ్లెన్ వెవర్లీ (Glen Waverley) మరియు వెర్రిబీ (Werribee) లో ఉన్నాయి. అక్షర జ్యోతి కేంద్రాలు ఐంట్రీ/వుడ్‌లియా (Aintree/Woodlea), బెర్విక్ (Berwick), ఎప్పింగ్ (Epping), గ్లెన్ వెవర్లీ (Glen Waverley), పాయింట్ కుక్ (Point Cook) మరియు మానర్ లేక్స్ (Manor Lakes) లో ఉన్నాయి.
SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ సమాచారం మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి.