మీరు సముద్రం లో ఈత కొడుతున్నపుడు పెద్ద సొరచేప కనపడితే ఏమి చేస్తారు?

Man swimming by shark in sea

Sharks are an important part of the marine ecosystem, and having a better understanding of them can reduce the risk of a shark encounter. Credit: Westend61/Getty Images/Westend61

ఆస్ట్రేలియా అంతటా అద్భుతమైన వాతావరణం, సముద్రం తీరాలు, ఇదొక అందమైన దేశం. ఎండా కాలంలో చక్కగా సముద్ర తీరాన ఆహ్లాదంగా తీరం గుండా నడవాలని పిల్లలు చక్కగా నీటిలో ఆదుకోవాలని అనుకుంటారు. కానీ నీటిలో వివిధ రకములైన చేపలు ముఖ్యంగా సొరచేప దాడులు తీవ్రంగా ఉన్నందున, మనకు ప్రమాదం కలిగే అవకాశం ఉంది. ఈ ప్రమాదాన్ని తగ్గించడానికి బీచ్ భద్రత గురించి తెలుసుకోవడం చాలా అవసరం. సముద్రం లో సొరచేప తారసపడితే మనం ఏమి చేయాలో అన్న విషయం గురించి తెలుసుకోవడం ముఖ్యం. సొరచేప ప్రవర్తన, అవి కలిగించే ముప్పును అర్థం చేసుకోవడం, సురక్షితంగా ఉండటానికి మనం ఎలా స్పందించాలో అన్న విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు.


Key Points
  • సముద్ర పర్యావరణ వ్యవస్థల సమతుల్యతను కాపాడుకోవడంలో సొరచేపలు కీలక పాత్ర పోషిస్తాయి.
  • బీచ్ భద్రతా మార్గదర్శకాలను అనుసరించడం మరియు పెట్రోలింగ్ చేసిన బీచ్ లలో ఈత కొట్టడం వల్ల సొరచేప దాడులు అరికట్టగలులుతాము.
  • నీటిలో సొరచేపను చుసిన వెంటనే మనకు భయం సహజమే కానీ, ప్రశాంతంగా ఉండి నెమ్మదిగా వెనుకకు వెళ్లడం చాలా అవసరం.
ఆస్ట్రేలియా గొప్ప సముద్ర పర్యావరణ వ్యవస్థ లో గ్రేట్ వైట్ షార్క్, టైగర్ షార్క్, హామర్ హెడ్ షార్క్, బుల్ షార్క్ మరియు వివిధ రీఫ్ షార్క్ ల వంటి అనేక సొరచేప జాతులు ఉన్నాయి. ఈ జీవులు సముద్ర ఆరోగ్యం మరియు సమతుల్యతను కాపాడుతాయి. మాంసాహారులుగా మరియు స్కావెంజర్లుగా పనిచేస్తాయి.

షార్క్ శాస్త్రవేత్త డాక్టర్ పాల్ బుట్చర్ వివరించినట్లుగా, షార్క్ ల గురించి మంచి అవగాహనను ఏర్పరుచుకోవడం మరియు వాటి ప్రవర్తన ని అర్ధం చేసుకోవడం ద్వారా ప్రమాదాల్ని తగ్గించవచ్చు.మత్స్య ఆహార వ్యవస్థ లో సొర చేపలే ముందంజలో ఉన్నాయి. దాని వేట వల్ల మత్స్య సంపదను సమతుల్యం చేసేందుకు మరియు జాతుల వైవిధ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడతాయి.

సొరచేప ప్రవర్తను అర్ధం చేసుకోవడం ఎలా?

ప్రిన్సిపల్ రీసెర్చ్ సైంటిస్ట్ గా డాక్టర్ బుట్చర్ం లో పనిచేస్తున్నారు. డాక్టర్ బుట్చర్ పరిశోధన బీచ్ కు వెళ్ళేవారికి సొరచేప వల్ల కలిగే ప్రమాదాన్ని తగ్గించడానికి మెరుగైన రక్షణ కార్యక్రమం పై దృష్టి సారిస్తున్నారు.
సముద్ర పర్యావరణాన్ని కాపాడుకోవడంలో ఈ జీవుల ప్రాముఖ్యతను గుర్తించి, ఇవి మనకు భయాన్ని కలిగించేవే అయిన పర్యావరణ సమతుల్యతను కాపాడే అద్భుతమైన జీవులు కాబట్టి వాటిని సంరక్షించడం ముఖ్యం.
Dr Paul Butcher
yVUSWJhA.png
A shark seen from the Surf Life Saving aerial surveillance helicopter – Image: Surf Life Saving Australia.
న్యూ సౌత్ వేల్స్ లో మే మరియు నవంబర్ మధ్య తెల్ల సొరచేపలు, అక్టోబర్ నుండి మే వరకు బుల్ సొరచేపలు మరియు సంవత్సరంలో ఏ సమయం లోనైనా టైగర్ సొరచేపలు ఎక్కువగా కనిపిస్తాయని డాక్టర్ బుట్చర్ చెప్పారు.

NSW లో సొరచేపలు ఏడాది పొడవునా ఉంటాయి, సముద్ర ఉపరితలం పై తెల్ల సొరచేపలు మరియు నీటి ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే ఎక్కువగా ఉన్నప్పుడు బుల్ సొరచేపలు ఉంటాయి. తెల్ల సొరచేపలు తీరానికి ఒక కిలోమీటరు దూరంలో ఉదయం 11 గంటల నుండి ఉండే అవకాశం ఉంది, అయితే బుల్ సొరచేపలు మాత్రం మధ్యాహ్నం నుండి రాత్రిపూట ఉండే అవకాశం ఉంది.

షార్క్ సంఘటన ప్రమాదాన్ని తగ్గించడానికి, డాక్టర్ బుట్చర్ కొన్ని ముఖ్యమైన బీచ్ భద్రతా మార్గదర్శకాలను అనుసరించాలని చెబుతున్నారు.

బీచ్ కు వెళ్ళినపుడు, సర్ఫ్ లైఫ్ సేవర్లు మరియు లైఫ్ గార్డులు పర్యవేక్షణ ఉన్న చోట్ల వద్ద మాత్రమే ఈత కొట్టండి. మరియు సముద్రం లో జెండాల మధ్య ఉండేలా చూసుకోండి. పెట్రోలింగ్ ఉన్న బీచ్ లలో మాత్రమే సర్ఫింగ్ చేయండి. ఎర చేపలు మరియు డైవింగ్ పక్షులు ఎక్కువగా ఉండే దగ్గర సర్ఫింగ్ చేయకుండా ఉండటానికి ప్రయత్నించండి.
Dr Paul Butcher
iApybPDQ.jpg
Dr Paul Butcher – Image: New South Wales Department of Primary Industries.

బీచ్ లో సురక్షితంగా ఉండటం ఎలా?

ా పరిశోధనా బృందానికి నాయకత్వం వహించే పర్యావరణ శాస్త్రవేత్త డాక్టర్ జాజ్ లాస్ సర్ఫ్ లైఫ్ సేవింగ్ ఆస్ట్రేలియా మరియు బీచ్ భద్రతకు ఇతర అంశాలు ఉన్నాయని వివరిస్తున్నారు.
షార్క్ ప్రమాదాలను తగ్గించాలంటే, సాయంత్రం సమయంలో కానీ లేదా రాత్రి సమయంలో కానీ లేదా తెల్లవారుజామున ఈత కొట్టకూడదు. ఎపుడైనా బీచ్ లో ఈత కొట్టేటప్పుడు స్నేహితులతో ఈత కొట్టడం మంచిది.
Dr Jaz Lawes
మీరు సముద్రంలో ఈత కొడుతున్నపుడు మీరు సొరచేపను చుస్తే, మొదట ప్రశాంతంగా ఉండటం చాలా అవసరం.

"పరిస్థితిని బట్టి, మీరు షార్క్ ప్రవర్తనను గమనిస్తూ స్పందించాలి. మీరు కంగారు పడి లేదా భయంతో ఉన్నారంటే, వెంటనే బయటకు వచ్చేయాలి. సొరచేపను రెచ్చగొట్టేలా ప్రవర్తించవద్దు”.

షార్క్ దాడులు చాలా అరుదు అని గుర్తుంచుకోవడం చాలా అవసరం అని డాక్టర్ పాల్ బుట్చర్ చెప్పారు. అయితే సొర చేప తారస పడినపుడు ఎలా స్పందించాలో తెలుసుకుంటే మంచిది.

ADE0lsGw.jpg
Lifesavers on patrol at the beach – Image: Surf Life Saving Australia.
మీరు నెమ్మదిగా అక్కడి నుండి వచ్చేయాలి దాన్ని చూస్తూనే వెన్నక్కి నెమ్మదిగా ఒడ్డుకు రావటానికి ప్రయత్నించాలి. మీరు అది కనపడినప్పుడు, వెనక్కు తిరగకూడదు. సొరచేపలు సాధారణంగా దిగువ నుండి దాడి చేస్తున్నందున నీటిలో నిలువుగా ఉండటానికి ప్రయత్నించండి, మీరు స్నేహితులతో ఉంటే, వారి దగ్గరకు వెళ్ళండి. గుంపు లో ఉన్నపుడు సొరచేప మనపై దాడి చేయదు.

సొరచేప నిరోధక పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి, 100% ప్రభావవంతంగా లేనప్పటికీ, అవి సొరచేపల ప్రమాదాలను తగ్గించగలవని డాక్టర్ బుట్చర్ చెప్పారు.

సర్ఫ్ లైఫ్ సేవింగ్ ఆస్ట్రేలియా మరియు లైఫ్ గార్డ్ ల నెట్ వర్క్ వారు బీచ్ లో ప్రమాదం లో ఉండేవారిని రక్షిస్తుంటారు.

లైఫ్ గార్డులు బీచ్ లో బైనాక్యులర్ లతో సొరచేపల కోసం చుస్తూ ఉంటారు, మరియు కొందరు డ్రోన్లు లేదా హెలికాప్టర్లు వంటి ప్రత్యేక నిఘా పద్ధతులను కూడా ఉపయోగిస్తుంటారు. వారు సొరచేపను గుర్తించినట్లయితే, సైరన్ లేదా గంట మోగిస్తారు, ఎరుపు మరియు తెలుపు జెండాను ఊపుతూ, వెంటనే బయటికి రమ్మని చెప్తారు.

49z6b0Zw.jpg
Impact ecologist and beach safety researcher Dr Jaz Lawes from Surf Life Saving Australia – Image: Surf Life Saving Australia.

పరిశోధన మరియు పరిరక్షణ

ఆస్ట్రేలియాలోని కొన్ని రాష్ట్రాల్లో షార్క్ సంఘటనలను తగ్గించడానికి, షార్క్ ట్యాగింగ్, డ్రమ్ లైన్లు మరియు షార్క్ నెట్ లను పెట్టడం వంటివి చేస్తున్నారు. అవే కాకుండా వైమానిక నిఘా కోసం డ్రోన్లు మరియు హెలికాప్టర్ల వాడకం వరకు వివిధ రకాల పద్దతులను ఉపయోగిస్తున్నారు.

న్యూ సౌత్ వేల్స్ ప్రభుత్వ షార్క్ ట్యాగింగ్ కార్యక్రమం ప్రపంచంలోనే అతిపెద్దది గా గుర్తించారు.

షార్క్ ట్యాగింగ్ అంటే నీటిలో ట్యాగ్ చేసిన సొరచేపలు ఉంటే బీచ్ కి వెళ్లిన వారికి హెచ్చరికలను అందిస్తుందని డాక్టర్ బుట్చర్ చెప్పారు.

" కాంట్రాక్టర్లు ట్యాగ్ చేసిన సొరచేపలు కనిపించే విధంగా గుర్తింపు ట్యాగ్ లతో ఉంటాయి”. ట్యాగ్ చేయబడిన అన్ని సొరచేపలను NSW తీరంలో 37 రియల్ టైమ్ షార్క్ లిజనింగ్ స్టేషన్ల నెట్ వర్క్ లో గుర్తించవచ్చు.

్ లో 500 మీటర్ల లోపల సొరచేప ఈదుతున్నప్పుడు లిసనింగ్ స్టేషన్లలకు తక్షణ హెచ్చరిక పంపబడుతుంది. అవే కాకుండా ఇతర రాష్ట్రాల్లయాప్ ను కూడా ఉపయోగిస్తారు.

"సొర చేపలు చాల ముఖ్యమైనవని, అవి మత్స్య సంపద లో భాగమని Dr Butcher చెబుతున్నారు. మన సాంస్కృతిక సముద్ర పరిరక్షణపై అవగాహన మరియు ఆసక్తిని పెంచుతుంది - ఇది చాలా ముఖ్యం."

Swimming with sharks
It is crucial to be prepared and know how to respond in case of a shark encounter in the water. Source: Moment RF / Khaichuin Sim/Getty Images

బీచ్ లో ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండటానికి చిట్కాలు:

  • ఎరుపు మరియు పసుపు జెండాల మధ్య పెట్రోలింగ్ చేసిన బీచ్ వద్ద ఈత కొట్టండి
  • నీటిలో మరియు చుట్టుపక్కల అన్ని సమయాల్లో పిల్లలను పర్యవేక్షించండి
  • గాయాలతో ఉన్నపుడు కానీ రక్తం స్రావం జరుగుతున్నపుడు నీటికి దూరంగా ఉండండి.
  • ఇతర వ్యక్తులతో ఈత కొట్టడం, డైవ్ చేయడం లేదా సర్ఫ్ చేయడం ఉత్తమం.
  • నీటి చుట్టుపక్కల ఉన్నప్పుడు మద్యం లేదా మాదకద్రవ్యాలను తీసుకోకండి
  • సర్ఫ్ లైఫ్ సేవర్ లు లేదా లైఫ్ గార్డ్ ల సలహా తీసుకోండి
  • ఎర చేపలు ఉన్న ప్రాంతాలను నివారించండి.
  • డాల్ఫిన్లు ఉంటే సొరచేపలు లేవు అని అర్ధం కాదు; రెండూ తరచుగా ఒకే లాంటి ఆహారాన్ని తింటూవుంటాయి. సొరచేపలు డాల్ఫిన్లను తింటాయి కూడా.
  • మీ స్థానిక కమ్యూనిటీ ని సంప్రదించండి

సర్ఫ్ లైఫ్ సేవింగ్ క్లబ్ లో వాలంటీర్ గా చేయాలంటే సందర్శించండి లేదా్ ను డౌన్లొడ్ చేసుకోండి.


    Share