Key Points
- మీ ఇంటి రీసైక్లింగ్ బిన్¬లో దుస్తులను పారేయకూడదు.
- కొన్ని ప్రధాన రిటైలర్లు రీసైక్లింగ్ కోసం దుస్తులను ఏ పరిస్థితిలో ఉన్నా స్వీకరిస్తారు.
- నాసిరకం దుస్తులు విరాళాలు వల్ల స్వచ్ఛంద సంస్థకు, పర్యావరణానికి కూడా నష్టం కలిగిస్తాయి.
ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ కౌన్సిల్ నివేదిక ప్రకారం మనం ప్రతి సంవత్సరం సగటున 56 కొత్త దుస్తులను కొనుగోలు చేస్తాము.
మన బట్టలు, ముఖ్యంగా బట్టలు త్వరగా చిరిగిపోవచ్చు , పాడైపోవచ్చు లేదా బోర్ కొట్టవచ్చు, కాబట్టి మనం వాటిని బాధ్యతాయుతంగా పారవేయాలి. దాని అర్థం దానం చేయడం కాని మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా దానిని ల్యాండ్ ఫిల్స్ అవ్వకుండా చూడగలుగుతాం.
రీసైక్లింగ్ బిన్ లో పారేయడం సమాధానం కాదు
"దుస్తులు, బూట్లు, ఫ్యాబ్రిక్, షీట్లు లేదా టవల్స్ లేదా మరే ఇతర దుస్తులను మీ రీసైక్లింగ్ బిన్లో వేయకూడదు అనేది గోల్డెన్ రూల్" అని ప్లానెట్ ఆర్క్ CEO రెబెక్కా గిల్లింగ్ వివరిస్తున్నారు.
ఆ సిస్టమ్స్ ద్వారా వాటిని రీసైకిల్ చేయలేమనే విషయం పక్కన పెడితే, బట్టలు రీసైకిల్ బిన్లోకి వెళ్లడం వల్ల వచ్చే సమస్య ఏమిటంటే, అవి రీసైక్లింగ్ మెషీన్లలో ఇరుక్కుని అన్నీ ఆగిపోతాయి.Rebecca Gilling, CEO of Planet Ark
దానికి మంచి పరిష్కారం ఏంటంటే ఫీజు చెల్లించడం ద్వారా, కొన్ని వ్యాపారాలు మీకు అవసరం లేని దుస్తులను తీసుకొని దానిని రీసైకిల్ చేయడానికి లేదా తిరిగి ఉపయోగించడానికి ఏర్పాట్లు చేస్తాయి.

Source: Moment RF / Andrew Merry/Getty Images
మీ బట్టలను 'ఓపీ షాప్'కు (op shop) దానం చేయండి
ఆస్ట్రేలియన్లు అవసరం లేని/ పనికిరాని దుస్తులను స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వడానికి ఇష్టపడతారు. 'ఓపీ షాప్' (op shop) అనే ఛారిటీ షాప్లో మీ బట్టలను ఉంచడానికి లేదా మీ షాపింగ్ డిస్ట్రిక్ట్లోని చారిటీ బిన్లో ఉంచడానికి ఎటువంటి ఖర్చు ఉండదు.
ఆస్ట్రేలియాలోని ఓపీ షాపులు విరాళంగా ఇచ్చిన దుస్తులను విక్రయించడం ద్వారా అవసరమైన వారికి దాదాపు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని ఆర్జిస్తున్నాయి.
కాని , మనం ఏ దానం చేసినా జాగ్రత్తగా ఉండాలి.
"ప్రజలు దుస్తులు ధరించలేని లేదా బాగా చిరిగిపోయిన వాటిని మాకు పంపకూడదు , ఎందుకంటే వారు వాటిని ల్యాండ్ ఫిల్¬కు పంపాల్సి ఉంటుంది, మరియు అది వారికి ఖర్చుతో కూడుకున్న పని " అని గిల్లింగ్ చెప్పారు.
అవసరం లేని దుస్తుల ను పారవేయడానికి ఛారిటీ షాపులు ప్రస్తుతం సంవత్సరానికి 13 మిలియన్ డాలర్లు ఖర్చు చేస్తున్నాయి.
విరాళం చేసిన వాటి యొక్క నాణ్యతను అంచనా వేయడానికి ఒక సులభమైన మార్గం ఉందని ఛారిటబుల్ రీసైక్లింగ్ ఆస్ట్రేలియా CEO ఒమర్ సోకర్ చెప్పారు.
ఒకవేళ మీరు ఆ బట్టలని స్నేహితుడికి ఇచ్చే పరిస్థితి లో లేకపోతే , దయచేసి దానిని స్వచ్ఛంద సంస్థలకు ఇవ్వవద్దు.Omer Soker, CEO of Charitable Recycling Australia
మీరు ఈ క్రింది ఛారిటబుల్ రీసైక్లింగ్ షాపు లను ఆస్ట్రేలియా అంతటా చూస్తారు.
- Salvos
- Vinnies
- Australian Red Cross
- Save the Children
- Lifeline
- Anglicare
- Brotherhood of St Laurence
మీరు చేసే ప్రతి విరాళంతో నిరోధించే కర్బన ఉద్గారాలను లెక్కించడానికి వెబ్సైట్¬లో 'రీయూజ్ ఇంపాక్ట్' టూల్ కూడా ఉంది.

Workers sorting out clothing at the St Vincent de Paul Society, a major charity recycling clothes, in Sydney. Source: AFP / PETER PARKS/AFP via Getty Images
మీ బట్టలను రీసైక్లింగ్ చేయండి
ఒకవేళ మీ దుస్తులు 'ఫ్రెండ్ టెస్ట్'లో పాస్ అవకపోతే, మా కొన్ని ప్రధాన దుస్తుల రిటైలర్ల వద్ద రీసైక్లింగ్ ప్రోగ్రామ్ కోసం చూడండి.
" అన్ని రకాల దుస్తుల ను కొన్ని H&M సెంటర్లలో ఉచిత రీసైక్లింగ్ కార్యక్రమం ఉపయోగించుకొని రీసైక్లింగ్ చేయొచ్చు " అని గిల్లింగ్ చెప్పారు.
“అదేవిధంగా, జారా ఎంపిక చేసిన స్టోర్లలో ఉచిత వస్త్ర సేకరణ కార్యక్రమం ఉంది.యునిక్లో ఏ పరిస్థితిలోనైనా ఉండే వారి స్వంత బ్రాండెడ్ దుస్తులను ఉచితంగా రీసైక్లింగ్ చేస్తున్నారు . మరియు పటగోనియా వారి స్వంత బ్రాండ్ దుస్తుల కోసం ట్రేడ్-ఇన్ ప్రోగ్రామ్ను కలిగి ఉంది, ఇక్కడ వినియోగదారులు వారి చిరిగిపోయిన దుస్తులను స్టోర్ క్రెడిట్ తో తిరిగి ఇవ్వవచ్చు."
ఈ ప్రోగ్రాం లో పాల్గునే దుకాణాన్ని ఈ వెబ్సైటు ద్వారా తెలుసుకోండి , recyclingnearyou.com.au
మీ స్థానిక కౌన్సిల్లో డ్రాప్-ఆఫ్ సదుపాయం కూడా ఉండవచ్చు.
ప్లానెట్ ఎర్త్ NSW, విక్టోరియా, క్వీన్స్లాండ్¬లలో స్పోర్ట్స్ షూస్ విరాళాలను స్వీకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అవసరమైన వారికి మంచి కండిషన్లో తిరిగి ఉపయోగించదగిన రన్నింగ్ షూలను అందించే లాభాపేక్షలేని సంస్థ ఇది.
బట్టలను మార్పిడి చేసే కార్యక్రమానికి హాజరు కండి
క్లాతింగ్ ఎక్స్ఛేంజ్ నిర్వహించే దుస్తుల మార్పిడి కార్యక్రమాలు ఇప్పుడు ఊపందుకుంటున్నాయి.
"సిడ్నీలోని క్లాతింగ్ ఎక్స్ఛేంజ్లోని చేస్తున్న బట్టల మార్పిడి ఒక అద్భుతమైన అవకాశం" అని సిడ్నీ నగర కౌన్సిలర్ ఆడమ్ వర్లింగ్ వివరించారు.
అధికంగా వినియోగించనపుడు మీ బట్టలను సర్దుకోవడం మంచిది కూడాను.
"మీరు అంతక ముందు ఎంతో నచ్చిన బట్టలను చెత్త లో పడేయకుండా ఇతరులకు ఉపయోగపడేలా చూస్తున్నాం " అని కౌన్సిలర్ వర్లింగ్ చెప్పారు.
దేశవ్యాప్తంగా రాబోయే బట్టల మార్పిడి కార్యక్రమాల కోసం క్లాతింగ్ ఎక్స్ఛేంజ్ ను సందర్శించండి.

Ol hangem ol klos long hanga. i gat ol diferen kaen klos mo hanga long wan klos exchange parti. Source: Moment RF / Marissa Powell/Getty Images
వ్యవస్థకు మద్దతు ఇవ్వండి
మన దుస్తుల యొక్క మొత్తం లైఫ్ సైకిల్¬ను పరిగణనలోకి తీసుకోవాలి. చారిటబుల్ రీసైక్లింగ్ ఆస్ట్రేలియా 'సర్క్యులర్ ఎకానమీ'ని ప్రోత్సహిస్తోంది, ఇక్కడ మనమందరం వినియోగాన్ని తగ్గించడం మరియు పునర్వినియోగం మరియు మనకు వీలైన చోట రీసైకిల్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాము.
ఇది నిజంగా ఉత్పత్తులకు మంచి సహాయకారిగా ఉంటుందిOmer Soker, CEO of Charitable Recycling Australia
"మనకు నిజంగా అవసరమైన బట్టలను కొనడం, వాటిని చివరి వరకూ వాడడం, వాటిని చిరిగితే కొట్టుకోవడం మరియు వాటిని వదిలివేసే సమయం వచ్చినప్పుడు, వాటిని స్వచ్ఛంద సంస్థలకు విరాళంగా ఇవ్వండి, తద్వారా అవి మంచి స్థితిలో ఉంటే అవి మరొక ఇంటిని కనుగొనవచ్చు" అని సోకర్ చెప్పారు.
“లేదా ఒకవేళ అవి పనికిరాని స్థితిలో ఉంటే లేదా పారవేయాల్సిన అవసరం ఉంటే, తగిన మార్గాన్ని ఎంచుకోండి .”