'నెట్ జీరో 2050’ : ఆస్ట్రేలియా దీర్ఘకాలిక ఉద్గారాల తగ్గింపు ప్రణాళిక

Melbourne from the air - Image Tiff Ng - Pexels.jpg

The burning of fossil fuels release large amounts of carbon dioxide and other greenhouse gases into the atmosphere. Image: Tiff Ng/Pexels

శిలాజ ఇంధనాలను (Fossil fuels) మండించడం వల్ల ఉత్పన్నమయ్యే గ్రీన్ హౌస్ వాయువు ఉద్గారాలను నివారించడానికి ఒక ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా వాతావరణ మార్పులను తగ్గించవచ్చు.


Key Points
  • శిలాజ ఇంధనాలను మండించడం వల్ల వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులు విడుదలవుతాయి, ఫలితంగా గ్లోబల్ వార్మింగ్ మరియు వాతావరణ మార్పు ఏర్పడుతుంది.
  • గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడం ద్వారా వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిమితం చేయడానికి చాలా తోడ్పడుతుంది.
  • నికర జీరో ఉద్గారాలు (Net zero emissions) అంటే ఉత్పత్తి అయిన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు మరియు వాతావరణం నుండి తీసుకున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల మధ్య సమతుల్యతను సాధించడం.
వాతావరణ మార్పుల ప్రభావాలతో, ప్రపంచ ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ నమూనాలలో దీర్ఘకాలిక మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

బొగ్గు, చమురు మరియు వాయువు వంటి శిలాజ ఇంధనాలను మండించడం - ఇవి వాతావరణంలోకి పెద్ద మొత్తంలో కార్బన్ డయాక్సైడ్ మరియు ఇతర గ్రీన్ హౌస్ వాయువులను విడుదల చేయడం , ఫలితంగా భూతాపం వేడెక్కుతుంది, వాతావరణ మార్పులకు ప్రధాన సారథిగా మారుతోంది.

అనేక దేశాల మాదిరిగానే, ఆస్ట్రేలియా గ్లోబల్ వార్మింగ్¬ను పరిమితం చేయడానికి దీర్ఘకాలిక గ్రీన్-హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు ప్రణాళికను అమలు చేసింది.

డాక్టర్ సైమన్ బ్రాడ్షా క్లైమేట్ కౌన్సిల్¬లో రీసెర్చ్ డైరెక్టర్¬గా తన పాత్రలో వాతావరణ మార్పులను పరిశోధిస్తున్నారు మరియు ఉద్గారాల తగ్గింపుకు విధానంలో మార్పులు అవసరమని చెపుతున్నారు.

Wind farm in South Australia - Image Alex Eckermann - Unsplash.jpg
A wind farm produces a form of renewable energy. Image: Alex Eckermann - Unsplash
2050 నాటికి నికర జీరో ఉద్గారాలను (Net zero emissions) సాధించడానికి చాలా దేశాల మాదిరిగానే ఆస్ట్రేలియా కూడా ప్రణాళిక సిద్ధం చేస్తుంది. కాబట్టి, మనం విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని మార్చడం, సూర్యుడు మరియు గాలి నుండి ఎక్కువ శక్తిని మన విద్యుత్ వ్యవస్థలోకి ఉపయోగించేలా చూసూకోవాలి "

2050 కి చాలా సమయం ఉన్నట్టు అనిపిస్తుంది కాని , ఉద్గారాలను తగ్గించే చర్యలకు కాలపరిమితి అత్యవసరమని డాక్టర్ బ్రాడ్షా చెపుతున్నారు.

వచ్చే పది సంవత్సరాలలో ప్రపంచవ్యాప్తంగా గ్రీన్¬హౌస్ వాయు ఉద్గారాలను సగానికి పైగా తగ్గించి, వీలైనంత త్వరగా జీరో ఉద్గారాలను సాధించాలి . "మనకు సురక్షితమైన, సుసంపన్నమైన భవిష్యత్తు ఉండాలంటే తప్పకుండా గ్రీన్¬హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించేలా చూడాలి. "

వాతావరణ మార్పుల బిల్లు

ఆస్ట్రేలియా ప్రభుత్వం 2022 లోు ప్రవేశపెట్టింది. ఇది ఆస్ట్రేలియా లో గ్రీన్¬హౌస్ వాయు ఉద్గారాల తగ్గింపు లక్ష్యాలను వివరిస్తూ 2030 నాటికి ఉద్గారాలను 2005 స్థాయిల నుంచి 43 శాతానికి తగ్గించాలని, 2050 నాటికి నికర జీరో ఉద్గారాలకు చేరుకోవాలని నిర్ణయించింది .

"ఇది చాలా పెద్ద లక్ష్యం" అని ఆస్ట్రేలియన్ నేషనల్ విశ్వవిద్యాలయంలో పిహెచ్¬డి లెక్చరర్ ఆరోన్ టాంగ్ వివరిస్తున్నారు.

గతంలో, ఆస్ట్రేలియా ఫెడరల్ స్థాయిలో స్థిరమైన వాతావరణ విధానాన్ని కొనసాగించడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంది. ప్రస్తుత వాతావరణ మార్పుల బిల్లు తో అవసరమైన సుస్థిరతను , భవిష్యత్తులో మరింత ప్రతిష్టాత్మక కార్యాచరణకు పునాది వేస్తుందని ఆరోన్ టాంగ్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Dr Simon Bradshaw - Climate Council Head of Research.jpg
Dr Simon Bradshaw from the Climate Council. Image: Climate Council
ు (Net zero emissions) అంటే ఉత్పత్తి అయిన గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాలు మరియు వాతావరణం నుండి తీసుకున్న గ్రీన్ హౌస్ వాయు ఉద్గారాల మధ్య మొత్తం సమతుల్యతను సాధించడం. నికర సున్నా ఉద్గారాలను చేరుకోవాలంటే పునరుత్పాదక ఇంధనాలపై పెట్టుబడులు అవసరమని ఆయన చెప్పారు.

బొగ్గును మండించడం ద్వారా మనకు సగం వరకు విద్యుత్ లభిస్తుంది. ఆస్ట్రేలియాలో ఇంధనాన్ని ఉత్పత్తి చేయడానికి ఇతర మార్గాల్లో పెట్టుబడులు పెట్టడం వల్ల ఇంధన ధరలు తగ్గుతాయి మరియు ఆసియా పసిఫిక్ అంతటా ఆర్థిక అవకాశాలను సృష్టిస్తాయి. పునరుత్పాదక ఇంధన పరిశ్రమను మనం ఎంచుకున్నట్లయితే ప్రపంచ నాయకులం కాగలం.
Aaron Tang
పునరుత్పాదక ఇంధన వినియోగంలో ఆస్ట్రేలియా ముందంజలో ఉందని డాక్టర్ బ్రాడ్షా అంగీకరిస్తున్నారు.

"ఆస్ట్రేలియాలో అత్యంత ఎండ మరియు గాలులు కొదవ లేనందున, మనం విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానాన్ని మార్చే అపారమైన అవకాశం ఇక్కడ ఉంది."

నికర సున్నా ఉద్గారాలను సాధించడానికి ప్రతి ఒక్కరూ సహాయపడవచ్చు

మనం ఏ రకమైన రవాణాను ఉపయోగిస్తున్నామో పరిగణనలోకి తీసుకోవడం చాలా ముఖ్యం అని డాక్టర్ బ్రాడ్షా చెప్పారు.

ప్రస్తుతం మనం చేసే ప్రయాణాలు ఎక్కువగా పెట్రోల్, డీజిల్¬తో నడిచే కార్లలోనే జరుగుతున్నాయని, కాలినడకన వెళ్లడం , ప్రజారవాణా ద్వారా ఎక్కువ ప్రయాణాలు చేస్తే మనం కొంత తగ్గించిన వారమవుతాం. ఒకవేళ ఇంకా కార్లను ఉపయోగించాల్సి వస్తే, ఎలక్ట్రిక్ వాహనాల్లో ఆ ప్రయాణాలు మరింత చౌకగా మారుతున్నాయి.

మనమందరం ఇంట్లో చేయగలిగే ఇతర పనులు కూడా ఉన్నాయి.

Aaron Tang.png
Aaron Tang from the Australian National University. Image: Aaron Tang/ANU.
"మనం ప్రస్తుతం వంట చేయడానికి గ్యాసును ఉపయోగిస్తున్నాము, విద్యుత్ ఉపకరణాలను ఉపయోగిస్తే చాలా మంచిది . వాస్తవానికి, వాయువు శిలాజ ఇంధనాన్ని కలుషితం చేస్తున్నందున ఉద్గారాలను మనము తగ్గించే వారమవుతాము మరియు మనం మన ఇళ్లను కూడా ఆరోగ్యంగా మార్చుకోగలము.

మనం చేసే పనులు సమిష్టిగా ఉద్గారాల తగ్గింపులో సానుకూల వ్యత్యాసాన్ని కలిగిస్తాయని టాంగ్ చెప్పారు.

" మీరు చేసే ప్రతి చిన్న పని మార్పు తీసుకువస్తుంది . మీరు ఇంటిపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకోవచ్చు, బ్యాంకింగ్ సేవలను మార్చవచ్చు లేదా ఖచ్చితంగా ఓటు వేయవచ్చు! మీరు చేయగలిగే పనితో ఈ మార్పు కి నాంది పలకండి . ”

జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం

ప్రపంచంలోని జీవవైవిధ్యాన్ని పరిరక్షించడం మరియు సంరక్షించడం కూడా చాలా ముఖ్యం, ఇది జీవన-మద్దతు వ్యవస్థలో భాగం అని డాక్టర్ బ్రాడ్షా చెప్పారు.
ఆస్ట్రేలియా చుట్టూ ఉన్న పర్యావరణ వ్యవస్థలు, విలువైన అడవులు మరియు ఇతర అద్భుతమైన పర్యావరణాలను మనం రక్షించాల్సిన అవసరం ఉంది.
Dr Simon Bradshaw
ఉద్గారాల తగ్గింపు దిశగా ఆస్ట్రేలియా ప్రయాణం లో కొన్నిసవాళ్ళను ఎదుర్కోవచ్చు , కాని అధిగమించి పోరాడుతుందని టాంగ్ వివరిస్తున్నారు.
electric-charge-2301604_1920 - Image Paulbr75 - Pixabay.jpg
Consider changing from petrol or diesel vehicle to an electric vehicle. Image: Paulbr75 - Pixabay
"క్లిష్టమైన సమస్యలను అధిగమించడం మనకు కొత్తేమి కాదు , COVID-19 మనకు మరిన్ని పాఠాలు నేర్పింది . మనం పెద్ద పెద్ద పెట్టుబడులు కూడా పెట్టగలము.

మనం, మన కుటుంబాలు కలిసి ఉద్గారాల తగ్గింపును సాధించడంలో పాత్ర పోషించవచ్చు.

'వాతావరణ మార్పుల ప్రభావాన్ని పరిశీలిస్తే కొంత వరకు భయమేస్తున్న , భవిష్యత్తును గురించి అలోచించి వాతావరణ మార్పులపై మంచి నిర్ణయం ద్వారా మంచి భవిష్యత్తును నిర్మించవచ్చు" అని డాక్టర్ బ్రాడ్షా చెప్పారు.

Share