Adolescence Review: పిల్లలలో నేర ప్రవృత్తి పెరుగుతోందా.. కుటుంబ సంబంధాల లేక సామాజిక విలువల లోపమా?

A close up of a billboard for the TV show Adolescence

The Netflix drama 'Adolescence' is sparking conversations around the subject of toxic masculinity, harmful internet content, and children's social media use. Source: Getty / Mike Kemp/In Pictures

అడాలసెన్స్, టీనేజ్ ఈ పదాలు వినగానే అందిరిలోనూ ఒక రకమైన అలజడి కలుగుతుంది. ముఖ్యంగా, తల్లితండ్రులలో, ఆ వయసువారిలో. అయితే తల్లితండ్రుల మానసిక ఆందోళన మనకు కన్పిస్తుంది కాని పిల్లలో రేకెత్తే ఉద్వేగాలు మనకు కన్పించవు. అలా అనడం కంటే, వాటిని మనం గుర్తించం. గుర్తించినా పట్టించుకోము. అది జీవన పరిణామ క్రమంలో ఒక భాగంగా భావించి విస్మరిస్తాం. నేటి సామాజిక భాషలో చెప్పాలంటే, లైట్ తీసుకో, వాళ్లంతే అంటాం.


నిజంగానే ఇది లైట్ గా తీసుకోవల్సిన విషయమా? లేక కౌమార, యవ్వన దశలోనున్న మన పిల్లల పట్ల మరింత శ్రద్ధ వహించాల్సి ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానమే, నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమవుతున్న ‘అడాలసెన్స్’ అనే నాలుగుభాగాల వెబ్ సీరిస్. ఈ సీరియల్ మార్చిలో విడుదలైనప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా అలజడిని సృష్టిస్తోంది. మార్చి 13 నుంచి నేటి వరకు దాదాపు 9కోట్ల 67లక్షల మంది ఈ సీరియల్ ను చూశారు అంటే, ఎంతగా ఈ కార్యక్రమం అందరిని ప్రభావితం చేసిందో మీరే ఊహించుకోవచ్చు. బ్రిటన్ ప్రధాని కియర్ స్టామర్ సైతం, ‘ఒక తండ్రిగా, యవ్వన దశలో ఉన్న తన కొడుకు, కూతురితో కల్సి ఈ సీరియల్ ను చూడటమంటే, సాహసమేనని’ వ్యాఖ్యానించడం, ఈ సమస్య తీవ్రతను చెప్పకనే చెపుతుంది. అంతేకాక, ఈ సీరియల్ను బ్రిటన్ లోని అన్ని హైస్కూళ్లలో ఉచితంగా చూపించాలన్న నెట్ ఫ్లిక్స్ నిర్ణయాన్ని సమర్ధించి, ఆమోదించారు కూడా.

అసలు ఇంతకి ఏమిటి ఈ అడాలసెన్స్ వెబ్ సీరిస్? ఏముంది అంతగా దాంట్లో, ప్రపంచమంతా వేలంవెర్రిగా మాట్లాడుకోవడానికి అని మీకు సందేహం కలగవచ్చు.

SBS తెలుగు ద్వారా తాజా ఆస్ట్రేలియా, అంతర్జాతీయ వార్తలు, మరియు కమ్యూనిటీ కథలను తెలుగులో వినండి. మరిన్ని ఆసక్తికరమైన శీర్షికలను లో వినవచ్చు. అదనంగా, లేదా ద్వారా కూడా వినొచ్చు. తాజా అప్డేట్‌ల కోసం మా మరియు పేజీలను ఫాలో చేయండి.


Share