Key Points
- ఆస్ట్రేలియాలో కార్లను అమ్మడానికి 3 మార్గాలు ఉన్నాయి: అవి.... వ్యక్తి నుండి వ్యక్తికి, డీలర్¬షిప్ ద్వారా లేదా వేలం ద్వారా.
- ప్రైవేట్¬గా అమ్మేటపుడు పరిగణనలోకి తీసుకోవలసిన విషయాలు ఏంటంటే ధర, అంతకు ముందు గల రిపేర్¬లు మరియు కొన్ని రాష్ట్రాల్లో తప్పనిసరిగా రోడ్¬కు సంబంధించిన సరైన తనిఖీ.
- మీ కారును అమ్మిన తరువాత, మీ మోటారు రిజిస్ట్రీ అథారిటీ ద్వారా అవసరమైన విధంగా రిజిస్ట్రేషన్ బదిలీని పూర్తి చేయడం తప్పనిసరి.
ఆస్ట్రేలియాలో పాత కార్లను (Used Cars) అమ్మేవారికి, వాటిని కొనుగోలు చేసేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.
ఇటీవలి ప్రాక్సీ అంచనాల ప్రకారం, ఉపయోగించిన వాహన (Used cars) మార్కెట్ కొత్త వాహనాల మార్కెట్ కంటే మూడు రెట్లు పెద్దది.
అయితే మీ కారును అమ్మకానికి పెట్టడం ఎలా?
ప్రైవేటుగా లేదా గుర్తింపు పొందిన డీలర్ లేదా వేలం సంస్థ ద్వారా విక్రయించాలా వద్దా అనేది నిర్ణయించాల్సిన మొదటి విషయం అని న్యూ సౌత్ వేల్స్ ఫెయిర్ ట్రేడింగ్ రెగ్యులేటరీ ఎంగేజ్మెంట్ డైరెక్టర్ కాథీ టౌన్సెండ్ చెప్పారు.

Credit: Alan Powdrill/Getty Images
క్లాసిక్ మరియు కలెక్టర్ వాహనాలను విక్రయించడానికి ఆక్షన్ హౌస్ మంచి ఎంపిక , అయితే మీ పాత కారును ఇచ్చేసి కొత్తదాని కోసం ట్రేడింగ్ చేసేటప్పుడు కారు డీలర్ కు ఇవ్వడం మంచిది.
వ్యక్తి నుండి వ్యక్తి అమ్మకాలు, సాధారణంగా ఫేస్¬బుక్ మార్కెట్ ప్లేస్ లేదా మరొక ఆన్¬లైన్ అడ్వర్టైజింగ్ ప్లాట్¬ఫారం ద్వారా జరుగుతుంటాయి.
Ms టౌన్సెండ్ (Ms. Townsend) ప్రైవేట్¬గా కారును అమ్మాలని అనుకున్నపుడు మీకు ఉపయోగపడుతుందనుకునే పేపర్ వర్క్ యొక్క సారాంశాన్ని వివరిస్తున్నారు.

concerned Asian Chinese mature woman comparing financial bill statement with bank on phone line Credit: Edwin Tan /Getty Images
ప్రైవేట్¬గా కారు అమ్మడానికి చిట్కాలు
ఆన్¬లైన్ ఫ్లాట్¬ఫారం కార్ అమ్మకాల యొక్క కన్స్యూమర్ మార్కెటింగ్ మేనేజర్ కారా ఫెల్లా, కారు లిస్టింగ్ ను ప్రభావితం చేసే కీలక అంశాలను తెలిపారు.
- ఏవైనా లోపాలతో సహా మీ కారు మరియు పరిస్థితి గురించి పారదర్శకత: తనిఖీల సమయంలో సంభావ్య కొనుగోలుదారులను వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఇది సహాయపడుతుంది. మరియు కొనుగోలు జరిపే రోజు ఎటువంటి ఇబ్బందికరమైన అనుకోని సంఘటనలను ఎదుర్కోకుండా సహాయపడుతుంది.
- కొనుగోలుదారులకు మీ స్పందించే సమయం: “విచారణలు మరియు ప్రశ్నలకు సకాలంలో స్పందించడం చాలా ముఖ్యం […], వారు ఇతర కార్ల గురించి కూడా విచారించే అవకాశం ఉంది, కాబట్టి మీరు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి".
- బేరసారాలు మరియు ధరల నిర్ణయం: కొనుగోలుదారుల నుంచి లభించే ఆసక్తి మీరు నిర్దేశించే ధర బట్టి ఉంటుంది . వారిని ఆకర్షించడంలో మీకు సహాయపడటానికి మీ కారును నిజమైన మార్కెట్ విలువకు దగ్గరగా సిఫార్సు చేసిన పరిధిలో ధరను నిర్ణయించడానికి ప్రయత్నించండి. [...] మీకు వీలైతే, బేరసారాల కోసం మీ లిస్టింగ్ ధరలో కొంచెం తగ్గింపును అనుమతించండి, అలాగే మీరు అంగీకరించడానికి సిద్ధంగా ఉన్న అతి తక్కువ ధరను కూడా అనుకోండి ."
అలెక్స్ ఫారెస్ట్ వెస్ట్రన్ ఆస్ట్రేలియాలోని రాయల్ ఆటోమొబైల్ క్లబ్ (RC) లో వెహికల్స్ అండ్ ఫ్యూయెల్స్ మేనేజర్.
అమ్మకానికి ముందు కారుపై ఉన్న మెకానికల్ రిపేర్లు బట్టి ధర మరియు వారి ఆసక్తి నిర్ణయించబడతాయని అయన తెలిపారు.
తరచుగా, మీరు ప్రకటనలలో చూసి నట్లుగా కారు కొత్తగా సర్వీసింగ్ చేయబడిందనీ, దీనికి కొత్త టైర్లు ఉన్నాయనీ అన్న కార్లకు కొనుగోలుదారుకు మంచి అనుభూతిని కలిగిస్తుంది మరియు అటువంటి కార్ల పై ఆసక్తి చూపుతుంటారు కూడా.Alex Forrest
"సాధారణంగా, ఆఫ్టర్ మార్కెట్¬లో మీరు కొనుగోలు చేయగల అన్ని యాడ్-ఆన్¬లు మరియు ఆప్షనల్ ఎక్స్¬ట్రాలు (అదనంగా జోడించేవి) కారు యొక్క విలువకు పెంచవు , ప్రత్యేకించి కొనుగోలుదారు వెళ్లి కారును మళ్లీ మునుపటిలా మార్చవలసి వస్తే. వారు దానిపై ఉన్న ఆప్షనల్ ఎక్స్‌ట్రాలను పెద్దగా పరిగణలోకి తీసుకోరు."

Australia Explained - Selling your Car - woman driving a car Credit: FG Trade/Getty Images
Ms ఫాయెల్లా (Ms. Faella ) దీని గురించి ఇతర మార్గాలు వివరిస్తున్నారు.
"మీరు కొనుగోలుదారుడిని బహిరంగ ప్రదేశంలో కలవడానికి ఏర్పాట్లు చేయవచ్చు, ఉదాహరణకు, షాపింగ్ సెంటర్ కార్ పార్కింగ్ లాంటివి.
టెస్ట్ డ్రైవ్¬లో మిమ్మల్ని కారు తాళాలను పట్టుకోమని అడగవచ్చు లేదా టెస్ట్ డ్రైవ్¬కు వెళ్ళేటప్పుడు వారి డ్రైవింగ్ లైసెన్స్¬ను కూడా మీరు సెక్యూరిటీగా ఉంచుకోవచ్చు. మీరు కూడా వారితో టెస్ట్ డ్రైవ్¬కు వెళ్లి ప్యాసింజర్ సీట్¬లో కూర్చోవచ్చు అని ఆమె తెలిపారు.
ఏదేమైనా, మీ కారును విక్రయించే ముందు ఆప్షనల్ అప్¬గ్రేడ్స్ మరియు మార్పులు అవసరం లేదని అది అంత తెలివైన పని కాదని ఆమె సలహా ఇస్తున్నారు.

Australia Explained - Mechanic fixes engine Credit: Reza Estakhrian/Getty Images
ప్రీ-సెల్లింగ్ మరియు ఆఫ్టర్ సేల్ ఆవశ్యకతలు
మీ రాష్ట్రం లేదా ప్రాంతాన్ని బట్టి, అమ్మకానికి ముందు మీ వాహనం కాంప్లయెన్స్ కండిషన్ తనిఖీని పాస్ అవడం తప్పనిసరి కావచ్చు.
ఉదాహరణకు, విక్టోరియాలో, యాజమాన్యాన్ని (ownership) బదిలీ చేయడానికి ముందు మీరు రోడ్డు అర్హత కలిగిన వాహన ధృవీకరణ పత్రాన్ని పొందాలి. కానీ వెస్ట్రన్ ఆస్ట్రేలియా లో అలా కాదు.
"కాబట్టి, ఆస్ట్రేలియాలోని వివిధ రాష్ట్రాల్లో చట్టప్రకారం అవసరమైన వాహన తనిఖీలలో గణనీయమైన తేడాలు ఉన్నాయి" అని ఫారెస్ట్ చెప్పారు.
"ఆ తర్వాత వెహికల్ మెకానికల్ కండిషన్ తనిఖీలు కూడా ఉన్నాయి, అవి తప్పనిసరి కాదు, కానీ ఉపయోగించిన కారును కొనాలనుకునేవారికి ఇవి సిఫార్సు చేస్తారు."
చివరగా, మీరు మీ కారును విక్రయించిన తర్వాత, చేయవలసిన మూడు ముఖ్యమైన విషయాలు:
- మీ బీమా మరియు రోడ్ సైడ్ అసిస్టెన్స్ ప్రొవైడర్లను సంప్రదించండి.
- మీ టోల్ వే ఖాతా మీ తరువాతి వాహనానికి బదిలీ చేయబడిందని నిర్ధారించుకోండి, మరియు
- మీ రాష్ట్రం/ప్రాంతంలోని మోటార్ రిజిస్ట్రీ కార్యాలయానికి తెలియజేయండి.
ఉదాహరణకు, న్యూ సౌత్ వేల్స్¬లో, మీరు మీ కారు డిస్పోజల్ గురించి సర్వీస్ NSWకు తెలియజేయాల్సి ఉంటుంది.
"అమ్మిన తర్వాత వీలైనంత త్వరగా దీనిని చేయడం చాలా ముఖ్యం, ఎందుకంటే ఇది కొత్త కొనుగోలుదారుకు వర్తించే జరిమానాలను మీపై పడకుండా చూస్తుంది " అని NSW ఫెయిర్ ట్రేడింగ్¬కు చెందిన Ms టౌన్సెండ్ (Ms Townsend) వివరించారు.

Car repairman giving car keys to customer after success car repairing in garage Source: Moment RF / thianchai sitthikongsak/Getty Images
"మీ స్థానిక రాష్ట్ర అవసరాలు ఏమిటో తనిఖీ చేయండి. అవి ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా మారతాయి. కానీ చాలా సందర్భాల్లో, మీరు మీ మోటారు వాహన రిజిస్ట్రేషన్ అథారిటీ కి తెలియజేయాల్సి ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్లను నిర్వహించే అథారిటీ రాష్ట్రాన్ని బట్టి మారుతుంది.
మీరు మీ కారును అమ్మేశారా ?
అభినందనలు! మీరు ఆస్ట్రేలియాలో ఎక్కడ నివసిస్తున్నారు అనే దాని బట్టి మిగతా చేయవలిసిన విషయాలు.