క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ అంటే ఏమిటి మరియు దానిని ఎవరు చెల్లించాలి?

Young man holding paper letter reading shocking unpleasant unexpected news

A young man holding a paper letter reading shocking, unpleasant, unexpected news feels frustrated and stressed—high tax rates. Source: iStockphoto / fizkes/Getty Images/iStockphoto

క్యాపిటల్ గెయిన్స్ టాక్స్ (CGT) అనేది ఆర్థిక సంవత్సరానికి మీ పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయానికి కట్టవలిసిన ఒక ముఖ్యమైన పన్ను బాధ్యత. ఇది ప్రత్యేక పన్ను కాదు. ఇది ఏమిటో మరియు ఆస్ట్రేలియన్ టాక్సేషన్ ఆఫీస్ (ATO) వారు ఎలా అమలు చేస్తున్నారో ఈ ఆర్టికల్ మరియు పోడ్కాస్ట్ ద్వారా తెలుసుకోండి.


Key Points
  • ప్రాపర్టీ, షేర్లు, క్రిప్టోకరెన్సీ వంటి ఆస్తులను విక్రయించడం ద్వారా వచ్చిన లాభంపై క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ (సీజీటీ)ను చెల్లించాలి.
  • మీరు ఉండే ఇళ్లను అమ్మడం ద్వారా వచ్చే లాభం సాధారణంగా సిజిటి (CGT) నుండి మినహాయించబడుతుంది.
  • సీజీటీ (CGT) చెల్లించని పక్షంలో ఏటీవో (ATO) భారీగా జరిమానాలను విధించవచ్చు.
ఆస్తుల అమ్మకం ద్వారా వచ్చే లాభాలపై విధించే పన్నును సీజీటీ అంటారు. మీరు ఒక ఆస్తిని విక్రయించినప్పుడు మీకు మూలధన లాభం (ప్రయోజనం) ఉంటే, అది మీరు చెల్లించాల్సిన పన్నును పెంచుతుంది.

ఈ పన్ను కూడా సాధారణంగా జూన్ 30 న ఆస్ట్రేలియన్ ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత చేసే టాక్స్ రిటర్న్ ద్వారా సెటిల్ అవ్వబడుతుంది.

ఆస్తి లేదా షేర్లు వంటి క్యాపిటల్ అసెట్స్ ను అమ్మిన తరువాత వచ్చే లాభాలు లేదా నష్టాల పై పన్ను రిటర్న్¬లో రిపోర్ట్ చేయాలి లేని యడల జరిమానా పడే అవకాశం ఉంటుంది.

సిజిటి (CGT)కి ప్రత్యేకమైన పేరు ఉన్నప్పటికీ, ఇది ఆదాయపు పన్నులో ఒక భాగమే.

ఆస్ట్రేలియా లో పన్ను చెల్లించేవారు పన్ను రిటర్నులలో కాపిటల్ అసెట్స్ లాభాలు మరియు నష్టాలు రెండింటినీ ప్రకటించాలి దాని ద్వారా సంబంధిత పన్ను బాధ్యతలను పూర్తిగా నెరవేర్చిన వారవుతారు.
ఆస్ట్రేలియాలో అన్ని పన్నులు మరియు ఆదాయ సేకరణ అంశాలను ATO నియంత్రిస్తుంది.

చాలా మంది తమ వార్షిక పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి ట్యాక్స్ అకౌంటెంట్ల దగ్గరకు సహాయం కోసం వెళతారు.

మనోజ్ గుప్తా మెల్బోర్న్కు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్. అతను సిజిటి ఎలా వర్తిస్తుందో వివరిస్తారు.

మీరు మీ పన్ను బాధ్యతలను నెరవేరుస్తున్నారని నిర్ధారించుకోవడానికి మరియు చెల్లించాల్సిన పన్నును ఖచ్చితంగా నిర్ణయించడానికి, విక్రయించే ప్రతి ఆస్తికి క్యాపిటల్ లాభం లేదా నష్టాన్ని లెక్కించడం చాలా అవసరం.
Close up of female accountant or banker making calculations. Savings, finances and economy concept
Close up of female accountant or banker making calculations. Savings, finances and economy concept Source: Moment RF / Prapass Pulsub/Getty Images
ఈ పన్ను బాధ్యతను ఎలా లెక్కిస్తారో ఏటీవో అసిస్టెంట్ కమిషనర్ టిమ్ లోహ్ (Tim Loh) వివరిస్తున్నారు.

నూరి కొన్ని షేర్లను 5000 డాలర్లకు కొనుగోలు చేశారనుకుందాం, ఆమె ఆరు నెలల పాటు షేర్లను ఉంచుకొని వాటిని 5500 డాలర్లకు అమ్మారనుకుందాం . ఇప్పుడు క్యాపిటల్ లాభాలు లేదా నష్టాలు లేవని భావించి, నూరి తన పన్ను రిటర్న్¬లో 500 డాలర్ల క్యాపిటల్ లాభాన్ని డిక్లేర్ చేయాలి మరియు ఈ లాభంపై తన వ్యక్తిగత ఆదాయపు పన్ను రేటు వద్ద పన్ను చెల్లించాలి" అని లోహ్ చెప్పారు.

CGT మినహాయింపులు

చాలా రియల్ ఎస్టేట, కాని కొన్ని రియల్ ఎస్టేట్ లావాదేవీలు సిజిటి నుండి పూర్తిగా మినహాయించబడతాయని గమనించడం ముఖ్యం అని గుప్తా వివరిస్తున్నారు.

"సాధారణంగా, మనం ఉంటున్న ఇళ్లకు క్యాపిటల్ లాభాల పన్ను నుండి మినహాయింపు ఉంటుంది. ఒక వ్యక్తి ఉండటానికి ఇల్లు కొనుగోలు చేసి, కొనుగోలు చేసిన తేదీ నుండి, వారు అక్కడ నివసిస్తూ, దానిలో నివసిస్తున్నప్పుడు విక్రయించినట్లయితే, క్యాపిటల్ గెయిన్ మొత్తంతో సంబంధం లేకుండా, ఆ మొత్తం క్యాపిటల్ లాభాల పన్ను నుండి మినహాయింపు పొందుతుంది" అని ఆయన చెప్పారు.

అనేక సందర్భాల్లో, మీరు చెల్లించాల్సిన సిజిటిపై డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

మీరు ఒక ఆస్తిని అమ్మినపుడు, మీరు కనీసం 12 నెలలు అక్కడ ఉండి ఉంటే మరియు ఆస్ట్రేలియన్ టాక్స్ రెసిడెంట్ అయ్యుంటే మీ క్యాపిటల్ గెయిన్ టాక్స్ లో 50 శాతం వరకు తగ్గించవచ్చు.

దీనిని సిజిటి డిస్కౌంట్ అంటారు, అంటే మీరు అమ్మకం నుండి సంపాదించిన లాభంలో సగం మాత్రమే సిజిటికి చెల్లించాల్సి ఉంటుంది.
Wooden cubes with word 'Tax' on australian dollars
Wooden cubes with word 'Tax' on australian dollars Source: iStockphoto / alfexe/Getty Images

పన్ను ఎగవేతకు జరిమానాలు

ఆస్ట్రేలియన్ పన్ను నివాసితులు/చెల్లింపుదారులు ఆర్థిక సంవత్సరంలో మూలధన లాభాలను రిపోర్ట్ చేయాలి మరియు పన్నులు చెల్లించాలి, కొంతమంది వ్యక్తులు ఈ బాధ్యతలను తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారు, ఇది సంభావ్య జరిమానాలకు దారితీస్తుంది.

అనుమానాస్పద ఆర్థిక కార్యకలాపాలు, రిపోర్ట్ చేయని మూలధన లాభాల పన్నును ATO (ఏటీవో) ఎలా పర్యవేక్షిస్తుందో లోహ్ వివరిస్తున్నారు.

మీరు సరైన పని చేస్తున్నారని నిర్ధారించడానికి, బ్యాంకులు, రాష్ట్ర రెవెన్యూ కార్యాలయాలు, ల్యాండ్ టైటిల్ కార్యాలయాలు, భీమా కంపెనీలు, షేర్ రిజిస్ట్రీలు వంటి అనేక సంస్థల నుండి ఆదాయ డేటా మరియు ఇతర డేటాను వారు సేకరిస్తారమని" ఆయన చెప్పారు.
మీరు క్యాపిటల్ లాభాల పన్ను చెల్లించాల్సిన అవసరం ఉందా లేదా మీకు ఖచ్చితంగా తెలియకపోతే, మీరు ATO ని సంప్రదించడం లేదా రిజిస్టర్డ్ టాక్స్ ఏజెంట్¬తో మాట్లాడటం చాలా ముఖ్యం.
Tim Loh
ఇతర పన్నుల మాదిరిగానే క్యాపిటల్ లాభాల పన్ను ఎగవేతకు మరియు వ్యక్తిగత ప్రవర్తన ఆధారంగా లెక్కించబడతాయి.

పన్ను చెల్లించడం లో జాగ్రత్తలు తీసుకోవడంలో వైఫల్యం, నిర్లక్ష్యము మరియు ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం వంటి ప్రవర్తనను ATO నిర్ణయిస్తుంది. ప్రతి రకమైన ప్రవర్తనకు వసూలు చేసే జరిమానా శాతం భిన్నంగా ఉంటుంది.

అదనంగా, ATO (ఏటీవో) పన్ను తక్కువగా చెల్లించిన యడల వడ్డీని కూడా వసూలు చేయవచ్చు.

కేసుల వారీగా పన్ను తగ్గించి కట్టినవారికి 25 నుంచి 100 శాతం వరకు జరిమానా విధించవచ్చని లోహ్ చెప్పారు.

మీరు పన్ను ఎగవేతకు పాల్పడుతుంటే, మీరు వ్యవహరిస్తున్న ప్రవర్తనను బట్టి జరిమానాలు గణనీయంగా ఉంటాయి. మీరు నిజాయితీగా తప్పు చేసి ఉంటే, జరిమానాలు తగ్గించేలా చూస్తారు . కానీ మీరు ఉద్దేశపూర్వకంగా వ్యవస్థను తప్పుదారి పట్టించాలనుకుంటే , మీ బాధ్యతలను తప్పించుకుంటే, గణనీయమైన జరిమానాలు ఉన్నాయి" అని ఆయన చెప్పారు.
ఉద్దేశపూర్వక మరియు పునరావృత నేరస్థులు కూడా క్రిమినల్ ప్రాసిక్యూషన్ను ఎదుర్కోవచ్చు.

ఆస్ట్రేలియా ప్రధానంగా నగదు రహిత ఆర్థిక వ్యవస్థ.

అయినప్పటికీ, కొంతమంది తమ ఆర్థిక లావాదేవీలను నగదు రూపంలో నిర్వహించవచ్చు, ఇది వారి పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయాన్ని తక్కువగా రిపోర్ట్ చేయడానికి మరియు పన్నులను తప్పించుకునే అవకాశం ఉండేలా చూస్తుంది.

కానీ ఆస్తి లేదా షేర్లు వంటి CGT (సిజిటి) ఆస్తులను అమ్మేటప్పుడు ఇది చాలా అరుదుగా జరుగుతుంది.

"ఆస్ట్రేలియాలో, నగదు రూపం లో ఏదైనా జరిగే అవకాశం చాలా తక్కువ, ఎందుకంటే [ఎక్కువ] లావాదేవీలు నగదు రూపంలో కాకుండా బ్యాంకు లావాదేవీలుగా జరుగుతాయి" అని గుప్తా వివరించారు.

పన్ను జరిమానాలపై అర్జీ పెట్టడం ఎలా

పన్ను చెల్లింపుదారులు తమకు తప్పుగా జరిమానా విధించారని భావిస్తే అప్పీల్ చేసుకోవచ్చు.

అప్పీలుతో ATO (ఏటీవో) సంతృప్తి చెందితే, కొన్ని సందర్భాల్లో దానిని తగ్గించవచ్చు లేదా రద్దు చేయవచ్చు.

"సాధారణంగా, మీరు మీ పన్ను రిటర్నుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరియు మీ జరిమానా ను వ్యతిరేకిస్తూ అప్పీల్ చేయడానికి, ప్రక్రియ ద్వారా వెళ్ళాలి" అని లోహ్ చెప్పారు.

సిజిటితో సహా అన్ని పన్ను బాధ్యతలకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యమని, ఎందుకంటే ఇది మన సమాజానికి మద్దతు ఇవ్వడంలో కీలక పాత్ర పోషిస్తుందని లోహ్ నొక్కి చెప్పారు.

మీరు పన్నులు సరిగా చెల్లించకపోతే, మనలో ప్రతి ఒక్కరూ బాధపడతారు. అంటే మన పాఠశాలలు మరియు ఆసుపత్రులకు తగినంత నిధులు లభించకపోగా, దాని వల్ల తక్కువ మంది ఉపాధ్యాయులు, వైద్యులు మరియు నర్సులు.
Tim Loh

క్యాపిటల్ నష్టం

లాభం వచ్చినప్పుడు మాత్రమే పన్ను కట్టాలనే సాధారణ భావనకు విరుద్ధంగా, కొన్నిసార్లు నష్టం వచ్చినప్పుడు కూడా మీరు పన్నును చూపించవచ్చు.

దీన్నే క్యాపిటల్ లాస్ అంటారు.
african couple outside home with sold sign
happy African couple outside home with sold sign giving thumbs up Source: iStockphoto / michaeljung/Getty Images
బ్రిస్బేన్కు చెందిన IT కన్సల్టెంట్ వి.సుబ్రమణ్య తన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీని నష్టాల్లో విక్రయించారు. CGT (సిజిటి) బాధ్యత ఉండదని ఆయన ఆశించినప్పటికీ, ATO భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

"మాకు టాస్మేనియాలో ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఉంది. మేము దానిని $ 420,000 కు కొనుగోలు చేసాము మరియు బ్రిస్బేన్¬కు వెళ్ళే ముందు మేము కొన్ని సంవత్సరాలు దానిలో నివసించాము. కొన్నేళ్ల పాటు అద్దెకు ఇచ్చి , ఆ తర్వాత అమ్మాలనుకున్నాం. 4,20,000 డాలర్ల నుంచి 3,80,000 డాలర్లకు తగ్గింది. ఆ సంవత్సరానికి మేము రిటర్నులు దాఖలు చేసినప్పుడు, ATO తిరిగి వచ్చి, 'మీకు మూలధన లాభం ఉంది' అని చెప్పారు" అని ఆయన గుర్తు చేసుకున్నారు.

పెట్టుబడి ఆస్తి ఖర్చులను క్లెయిమ్ చేసినప్పుడు ఈ పరిస్థితి తలెత్తుతుంది, ఆస్తి యజమానులు తమకు నష్టం జరిగిందని అనుకుంటారు, అయితే ATO దీనిని లాభంగా పరిగణించవచ్చు.

ఇది ఎలా జరిగిందో సుబ్రమణ్యం వివరిస్తున్నారు.

"మేము పెట్టుబడి పెట్టిన ఆస్తికి రేట్ తగ్గి , ఆస్తి నిర్వహణ మరియు రేట్లు వంటి మినహాయింపులను క్లెయిమ్ చేస్తున్నాము, ఇది ధరను 355,000 డాలర్లకు తగ్గించింది. కాబట్టి, ఇప్పుడు 25,000 డాలర్ల మూలధన లాభం ఉందని, దానిపై మేము 3000-4000 డాలర్ల పన్ను చెల్లించాల్సి వచ్చిందని వారు చెప్పారు" అని ఆయన తెలిపారు .

జూలై 1 నుంచి జూన్ 30 వరకు ప్రతి ఆదాయ సంవత్సరానికి పన్ను రిటర్నులు దాఖలు చేయాలి. మీరు ట్యాక్స్ రిటర్న్ పూర్తి చేయాలనుకుంటే, అక్టోబర్ 31 లోగా దానిని నమోదు చేయండి లేదా టాక్స్ ఏజెంట్ను కలవండి.

్ 36 భాషలలో అన్ని పన్ను సంబంధిత విషయాలపై విలువైన సమాచారం ఉంది.

Share